Share News

Chennai News: మృత్యువులోనూ వీడని అన్నదమ్ముల బంధం..

ABN , Publish Date - Aug 05 , 2025 | 10:54 AM

తిరుత్తణి సమీపంలో సోమవారం వేకువజాము సంభవించిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. వివరాలిలా. పీలేరుకు చెందిన మాజీ సర్పంచ్‌ హుమయూన్‌ (70) అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.

Chennai News: మృత్యువులోనూ వీడని అన్నదమ్ముల బంధం..

- తిరుత్తణి వద్ద రోడ్డు ప్రమాదంలో సోదరుల దుర్మరణం

చెన్నై: తిరుత్తణి సమీపంలో సోమవారం వేకువజాము సంభవించిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య(Annamayya) జిల్లా పీలేరుకు చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. వివరాలిలా. పీలేరుకు చెందిన మాజీ సర్పంచ్‌ హుమయూన్‌ (70) అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చెన్నై(Chennai)లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఆ మేరకు హుమయూన్‌, ఆయన సోదరుడు షాజహాన్‌ (50), బంధువు హబీబ్‌ (35) కారులో చెన్నై బయలుదేరారు. కారును హబీబ్‌ నడిపాడు.


వేకువజామున తిరుత్తణి సమీపం ఆర్కాడుకుప్పం శివాలయం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగిఉన్న టిప్పర్‌ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవగా. హుమయూన్‌ ఘటనా స్థలంలోనే మరణించారు. కనకమ్మ సత్రం పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని హుమయూన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు,


nani2.jpg

తీవ్రంగా గాయపడిన షాజహాన్‌, హబీబ్‌లను చికిత్స నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక షాజహాన్‌ మృతి చెందారు. హబీబ్‌ను మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రహదారిలో గంటకు పైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 05 , 2025 | 10:54 AM