Share News

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. చివరకు ఎక్కడకు దారితీసిందంటే..

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:38 PM

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువకుడు మోసం చేయడంతో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణంలో చోటుచేసుకుంది. దీప రోషిణి అనే విద్యార్థిని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. చివరకు ఎక్కడకు దారితీసిందంటే..

- విద్యార్థిని ఆత్మహత్య

చెన్నై: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ విఫలం కావడంతో ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుచ్చి సమీపంలో చోటుచేసుకుంది. వెంగూర్‌ నడువీధికి చెందిన వెంకటేశన్‌ కుమార్తె దీప రోషిణి (19) తిరుచ్చిలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతోంది. దీప సాయంత్రం పూట చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఇంట్లో ట్యూషన్‌ చెబుతోంది. కొంతకాలంగా దీపకు ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. రోజు గంటల తరబడి ఛాటింగ్‌ చేస్తున్న దీప, అతనిపై ప్రేమ పెంచుకున్నట్లు తెలిసింది.


nani1.jfif

ఈ క్రమంలో, మంగళవారం సాయంత్రం దీప తల్లి బయటకు వెళ్లి తిరిగిరాగా, ఇంటి తలుపులు లోపల గడి పెట్టి ఉండడం గమనించింది. పెద్దగా పిలిచినా ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం లేకపోవడంతో కిటికీ ద్వారా చూడగా, కుమార్తె ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికిచేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదుచేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమికుడు మోసం చేయడంతో దీప ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్‌ టెక్నాలజీస్‌ పరికరాలు

సబ్బుల్లో నంబర్‌ 1 బ్రాండ్‌గా సంతూర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2025 | 01:38 PM