BJP Leader: బీజేపీ సీనియర్ నేతపై కేసు నమోదు.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:07 PM
మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజా(Senior BJP leader H. Raja)పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చెన్నై: మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజా(Senior BJP leader H. Raja)పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుప్పరంకుండ్రం కొండపైవున్న సుబ్రమణ్యస్వామి ఆలయప్రాంగణంలో ఇటీవల మాంసాహారం పంపిణీ చేసిన వ్యవహారం కలకలంరేపింది. ఈ చర్యలను ఖండిస్తూ పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 4న ధర్నా నిర్వహించనున్నట్లు హిందూ మున్నాని సంస్థ ప్రకటించింది.
ఈ వార్తను కూడా చదవండి: Shocking: భర్త ఇంటిని అమ్మి ప్రియుడితో పరార్.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. తమిళనాడులో షాకింగ్ ఘటన..
అయితే తిరుప్పరంకుండ్రం పోలీసులు ధర్నాకు అనుమతి జారీచేయకుండా మదురై జిల్లా వ్యాప్తంగా 144సెక్షన్ అమలు చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ధర్నాలో పాల్గొన్న ఆందోళనాకారులను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా మదురైకు చెందిన సుందర వడివేలు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్(Madras High Court Madurai Bench)లో 144 సెక్షన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ధర్నాలను అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మదురై పళంగానత్తంలో సాయంత్రం 5నుంచి 6గంటల వరకు మాత్రమే ధర్నా నిర్వహించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసు భద్రత నడుమ ఒక మైక్‌ను వినియోగించుకోవాలని, ఇతర మతాలను కించపరచకుండా నినాదాలు ఉండాలని, ధర్నాను వీడియోలో రికార్డు చేయాలని న్యాయస్థానం నిబంధనలు విధించింది. పళంగానత్తంలో హిందూ మున్నాని ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న హెచ్.రాజా మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు
ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్ ఎన్నికలకే మొగ్గు
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర
ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Read Latest Telangana News and National News