Share News

Medak: స్నేహితుడి అన్న పెళ్లికి వచ్చి.. తిరిగిరాని లోకాలకు

ABN , Publish Date - Mar 04 , 2025 | 11:11 AM

తన స్నేహితుడి అన్న పెళ్లికి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న ఇద్దరు స్నేహితుల బైక్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలకు గురైన ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ సమీపంలో జాతీయరహదారిపై అయ్యప్ప ఆలయం సమీపంలో చోటు చేసుకుంది.

Medak: స్నేహితుడి అన్న పెళ్లికి వచ్చి.. తిరిగిరాని లోకాలకు

- బైక్‌ అదుపుతప్పి యువకుడి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

- కూకట్‌పల్లి శాంతినగర్‌కు చెందిన వారిగా గుర్తింపు

నర్సాపూర్‌(మెదక్): తన స్నేహితుడి అన్న పెళ్లికి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న ఇద్దరు స్నేహితుల బైక్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలకు గురైన ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌(Narsapur, Medak district) సమీపంలో జాతీయరహదారిపై అయ్యప్ప ఆలయం సమీపంలో చోటు చేసుకుంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మిత్ర క్లినిక్‌లో ట్రాన్స్‌జెండర్లకు నిలిచిన సేవలు


ఎస్‌ఐ లింగం వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి శాంతినగర్‌(Kukatpally Shantinagar)లో నివసించే సాయినిఖిల్‌ (21), మరో స్నేహితుడు మనీష్‏లు ఒకే బైక్‌పై ఆదివారం ఉదయం మెదక్‌లో తమ స్నేహితుడి అన్న పెళ్లికి హాజరై రాత్రి తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో 11 గంటల సమయంలో నర్సాపూర్‌ సమీపంలోని అయ్యప్పఆలయం వద్ద మూలమలుపు వద్ద అదుపుతప్పి బైక్‌ పల్టీకొట్టింది. దీంతో సాయినిఖిల్‌ అక్కడికక్కడే మృతి చెందగా మనీ్‌షకు తీవ్రగాయాలు కాగా నర్సాపూర్‌ ఆసుపత్రికి తరలించారు.


pandu3.jpg

అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా సోమవారం సాయినిఖిల్‌ మృతదేహానికి నర్సాపూర్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని తండ్రి రవి దుబాయ్‌లో ఉపాధి కోసం వెళ్లగా సాయినిఖిల్‌ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు బంధువులు పేర్కొన్నారు.


ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 11:14 AM