Hyderabad: మిత్ర క్లినిక్‌లో ట్రాన్స్‌జెండర్లకు నిలిచిన సేవలు
ABN , Publish Date - Mar 04 , 2025 | 10:43 AM
ట్రాన్స్‌జెండర్లకు(Transgenders) సేవలు అందిస్తున్న హైదరాబాద్(Hyderabad)లోని ఆరోగ్య సేవా కేంద్రం సేవలు నెల రోజులుగా నిలిచిపోయాయి.
- యూఎస్ ఎయిడ్ నిధులు తాత్కాలికంగా నిలిచిపోవడమే కారణం
హైదరాబాద్ సిటీ: ట్రాన్స్‌జెండర్లకు(Transgenders) సేవలు అందిస్తున్న హైదరాబాద్(Hyderabad)లోని ఆరోగ్య సేవా కేంద్రం సేవలు నెల రోజులుగా నిలిచిపోయాయి. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషన్ డెవల్‌పమెంట్(యూఎ్‌స ఎయిడ్) ద్వారా అంతర్జాతీయ ప్రాజెక్టులకు సాయాన్ని 90రోజులపాటు ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఆ సంస్థ నిధులతో నిర్వహిస్తున్న మిత్ర క్లినిక్ సేవలు ఆగిపోయాయి.
ఈ వార్తను కూడా చదవండి: Inter annual exams: విజయీభవ.. రేపటి నుంచి ఇంటర్ వార్షిక
ట్రాన్స్‌జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ నారాయణగూడ(Hyderabad Narayanaguda)లో 2021 సంవత్సరంలో మొదటి మిత్ర క్లినిక్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌జెండర్ల సేవల కోసం ప్రతి నెలా రూ.2.5లక్షల నిధులు అందించేవారని క్లినిక్‌కు అనుబంధంగా ఉన్న ట్రాన్స్ ఆరోగ్య నిపుణురాలు రచన ముద్రబోయిన తెలిపారు. ఈ ఆర్థికసాయాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో మిత్ర క్లినిక్‌లో నడిచిన ప్రాజెక్ట్‌కు అంతరాయం ఏర్పడిందన్నారు.

దీంతో ట్రాన్స్‌జెండర్లు, ఇక్కడ పనిచేసే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. గత నాలుగేళ్లలో ఈ క్లినిక్‌లో దాదాపు రెండువేల మందికిపైగా ట్రాన్స్‌జెండర్లకు వైద్య, ఆరోగ్య, మానసిక, కౌన్సెలింగ్ సేవలు అందించినట్లు రచన చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 33 ట్రాన్స్‌జెండర్స్ క్లినిక్‌లను బలోపేతం చేయడానికి మిత్ర క్లినిక్‌ను ఉపయోగించుకోవాలనుకున్నామని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు
ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..
ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి
Read Latest Telangana News and National News