Share News

Hyderabad: ఏపీకే లింక్‌లు పంపి.. ఖాతాలు హ్యాక్‌ చేసి.. రూ.8.24 లక్షలు స్వాహా

ABN , Publish Date - Dec 05 , 2025 | 06:47 AM

హైదరాబాద్‏కు చెందిన పలువురిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలను కొట్టేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.8.24 లక్షలను కొల్లగొట్టారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఏపీకే లింక్‌లు పంపి.. ఖాతాలు హ్యాక్‌ చేసి..  రూ.8.24 లక్షలు స్వాహా

హైదరాబాద్‌ సిటీ: ప్రముఖ బ్యాంకుల పేర్లతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్‌ నేరగాళ్లు ఇటీవల పలు కేసుల్లో రూ.8.24 లక్షలు కాజేశారు. షక్కర్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి (58)ని ఫోన్‌లో సంప్రదించిన ఓ వ్యక్తి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై విధించిన చార్జీలు తీసివేస్తామని తెలిపారు. దీంతో వారు పంపిన ఏపీకే లింక్‌ను తెరిచి వివరాలు నమోదు చేశాడు. వెంటనే మొబైల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.1.72 లక్షలు వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. పటేల్‌నగర్‌(Patelnagar)కు చెందిన వ్యక్తి (45)కి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు అతడి ఐడీఎఫ్‏సీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ను పెంచుతామని హామీ ఇచ్చారు.


city1.2.jpg

ఏపీకే లింక్‌లో వివరాలు పంపమని సూచించగా అదే విధంగా చేశాడు. అతడి ఫోన్‌లో బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన సైబర్‌ నేరగాళ్లు ఓటీపీలు తమ ఫోన్‌కు వచ్చేలా మార్చుకొని అతడి ఖాతా నుంచి రూ2.95 లక్షలు కాజేశారు. యాకుత్‌పురాకు చెందిన వ్యక్తి (48)కి ఆర్‌టీఓ పెండింగ్‌ చలాన్ల పేరుతో లింకు పంపారు. దాన్ని క్లిక్‌ చేసిన బాధితుడి ఫోన్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.2.26 లక్షలు కాజేశారు. ఇలా పలు కేసుల్లో మొత్తం రూ.8.24 లక్షలు కాజేశారు. అపరిచితులు పంపిన ఏపీకే లింక్‌లు తెరవవద్దని సైబర్‌ క్రైం అధికారులు సూచిస్తున్నారు.


city1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 05 , 2025 | 06:48 AM