Share News

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:44 PM

తన డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి పంపిన లింక్‌ను ఓపెన్‌ చేసిన ఓ వీఆర్‌ఓ రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్‌ఓ యశస్విని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

- రూ.1.19లక్షలు స్వాహా

పెనుకొండ(అనంతపురం): తన డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి పంపిన లింక్‌ను ఓపెన్‌ చేసిన ఓ వీఆర్‌ఓ(VRO) రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండ(Penugonda)లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్‌ఓ యశస్విని(VRO Yashaswini) తెలిపిన మేరకు.. పెనుకొండ(Penukonda)లో ఆర్‌ఐగా పని చేసి బదిలీపై వెళ్లిపోయిన పురుషోత్తం నంబర్‌ నుంచి తనకు వాట్సాప్‌ ద్వారా ఆర్టీఓ ట్రాఫిక్‌ చలానా అనే యాప్‌లింక్‌ వచ్చిందన్నారు. ఏంటి ఇది అని అతడికి మెసేజ్‌ పెట్టగా, ఓపెన్‌ చేయమని సమాధానం వచ్చిందన్నారు.


pandu2.2.jfif

దీంతో ఒకే డిపార్ట్‌మెంట్‌ కదా అనుమానించడానికే ముందని, రెవెన్యూ సేవలకు అవసరం అవుతుందేమోననే నమ్మకంతో ఆ లింక్‌ ఓపెన్‌ చేసినట్లు తెలిపారు. ఇంతలో తన అకౌంట్‌లో ఉన్న రూ.1.19లక్షలు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ రావడంతో ఆందోళనతో బ్యాంక్‌ బాలెన్స్‌ చెక్‌చేస్తే నగదు కనిపించలేదని తెలిపారు. దీంతో పుట్టపర్తి సైబర్‌ క్రైం(Puttaparthi Cyber ​​Crime) కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు

రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2025 | 12:44 PM