Share News

Ananthapuram: రమా.. నీవు లేకుండా ఎలా బతికేది...

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:45 PM

‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.

Ananthapuram: రమా.. నీవు లేకుండా ఎలా బతికేది...

- భార్య మృతదేహంపై పడి రోదించిన భర్త

- ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ

- మహిళ మృతి.. ముగ్గురికి గాయాలు

గార్లదిన్నె/శింగనమల(అనంతపురం): ‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట(Timmampet) వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు శింగనమలకు చెందిన దివ్యాంగుడైన చిన్న పోతన్న, రమాదేవి(35) దంపతులు శింగనమలలో కూలి పనులు చేసుకుని జీవించేవారు.


zzzzzzzzzzzzz.jfif

గ్రామంలో పనులు లేక పోవడంతో కొన్ని నెలలు కిందట రమాదేవి పుట్టినిల్లు అయిన పామిడికి వలస వెళ్లారు. అయితే వారికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడం, సదరం సర్టిఫికెట్‌ పనుల కోసం సోమవారం చిన్నపోతన్న, రమాదేవి తమ కుమారుడు సాంబశివను తీసుకుని తమ బంధువైన చంద్రశేఖర్‌తో కలిసి స్కూటీలో శింగనమలకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి పామిడికి స్కూటీలో బయల్దేరారు. తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై వీరి స్కూటీని బెంగళూరు నుంచి ద్విచక్ర వాహనాల లోడుతో మధ్యప్రదేశ్‌కు వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది.


pandu4.jpg

ఈ ప్రమాదంలో స్కూటీలో ప్రయాణిస్తున్న రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా చిన్న పోతన్న, కుమారుడు శివ, బంఽధువు శేఖర్‌ గాయపడ్డారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భార్య మృతదేహంపై పడి చిన్న పోతన్న కన్నీరుమున్నీరుగా రోదించాడు. ఎస్‌ఐ మహహ్మద్‌గౌస్‌ బాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ కల్లూరు సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను ఆదుపులోకి తీసుకుని వాహనాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి దిగుమతులు మూడింతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 18 , 2025 | 12:45 PM