Share News

Ananthapuram News: పుట్టిన రోజునాడే ఆత్మహత్య...

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:12 PM

నగరానికి చెందిన బీటెక్‌ విద్యార్థి చల్లా శ్రవణ్‌(18) పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తాము ఉంటున్న అపార్టుమెంట్‌లోని 5వ అంతస్తు నుంచీ దూకి ప్రాణం తీసుకున్నాడు. దీనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: పుట్టిన రోజునాడే ఆత్మహత్య...

- అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకిన బీటెక్‌ విద్యార్థి

- అక్కడికక్కడే మృతి

అనంతపురం: నగరానికి చెందిన బీటెక్‌ విద్యార్థి చల్లా శ్రవణ్‌(18) పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తాము ఉంటున్న అపార్టుమెంట్‌లోని 5వ అంతస్తు నుంచీ దూకి ప్రాణం తీసుకున్నాడు. దీనిపై అనంతపురం(Ananthapuram) నాలుగో పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదుచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెలుగుప్ప(Beluguppa) మండలానికి చెందిన లక్ష్మీనరసింహులు కుటుంబం రాంనగర్‌లోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స అపార్టుమెంట్‌లో నివాసం ఉంటోంది. ఇతడికి ఇద్దరు కుమారులు.


city2.2.jpg

చిన్నకుమారుడైన చల్లా శ్రవణ్‌ బళ్లారి(Ballary)లోని బీఐటీఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి ఏడాది చదువుతుండేవాడు. సోమవారం పుట్టినరోజు కావడంతో ఆదివారం ఇంటికి వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక అపార్టుమెంట్‌ 5వ అంతస్తు నుంచీ దూకాడు. తల, ఇతర భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి దిగుమతులు మూడింతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 18 , 2025 | 01:14 PM