Share News

US Postal Services Halted: అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత..ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి?

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:55 PM

ఇండియా పోస్ట్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. మీరు అమెరికాకు ఏదైనా పార్సల్ లేదా లెటర్ పంపాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ వార్త మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికాకు పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఎందుకు, ఎప్పటి నుంచనే చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

US Postal Services Halted: అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత..ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి?
US Postal Services Halted

అమెరికాలోని మీ కుటుంబానికి, మిత్రులకు పార్సల్స్ పంపించాలనుకుంటున్నారా? అయితే, ఈ సమాచారం మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ అమెరికాకు పంపే పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది (US Postal Services Halted). ఈ నెలాఖరులో అమల్లోకి వచ్చే US కస్టమ్స్ కొత్త నియమాల నేపథ్యంలో తపాలా శాఖ ఆగస్టు 25 నుంచి యునైటెడ్ స్టేట్స్‌కు పంపించే అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

జూలై 30న ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, ఇప్పటి వరకూ USD 800 వరకు వస్తువులకు ఇచ్చిన సుంకం మినహాయింపును తొలగించారు. దీంతో అమెరికా వెళ్లే పోస్టల్ సర్వీసులు సుంకాలకు లోబడి ఉంటాయని అధికారులు ప్రకటించారు. కానీ లెటర్స్, డాక్యుమెంట్స్ $100 విలువలోపు గిఫ్ట్ ఐటెమ్స్ మాత్రం పంపేందుకు అనుమతి ఉంది.


ఆపరేషనల్ సమస్యలు

అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఆగస్టు 15న కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసినా, అవి పూర్తిగా స్పష్టంగా లేవు. ఈ అస్పష్టత వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ క్యారియర్స్ ఆగస్టు 25 తర్వాత పోస్టల్ కన్సైన్‌మెంట్స్‌ను స్వీకరించడానికి నిరాకరిస్తున్నాయి. టెక్నికల్, ఆపరేషనల్ సమస్యలు కూడా ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు.


ఇండియా పోస్ట్ నిర్ణయం

ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా పోస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ ఐటెమ్స్ బుకింగ్‌ను నిలిపివేస్తోంది. కానీ, లెటర్స్, డాక్యుమెంట్స్, $100 విలువలోపు గిఫ్ట్ పార్సెల్స్‌కు మాత్రం అనుమతి ఇస్తోంది. ఇవి కూడా తాత్కాలికంగానే, ఎందుకంటే అమెరికా నుంచి మరిన్ని క్లారిటీలు వచ్చే వరకు మాత్రమే ఈ సేవలు కొనసాగుతాయి.


ఇప్పటికే బుక్ చేసిన పార్సెల్స్ ఏమవుతాయి?

మీరు ఇప్పటికే అమెరికాకు పార్సెల్ బుక్ చేసి ఉంటే, ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు పంపలేని పార్సెల్స్‌కు పోస్టేజ్ రీఫండ్ ఇస్తామని ఇండియా పోస్ట్ తెలిపింది. అంటే, మీ డబ్బు సేఫ్. అమెరికా కస్టమ్స్, USPS, ఇతర సంబంధిత వాటాదారులతో కలిసి ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.

ఈ మార్పు ఎవరిపై ప్రభావం చూపుతుంది?

ఈ కొత్త రూల్స్ వల్ల క్రాస్-బోర్డర్ ఈ-కామర్స్, వ్యక్తిగత షిప్‌మెంట్స్‌పై ఎక్కువ ప్రభావం పడనుంది. అమెరికాలోని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి ఏదైనా పంపాలనుకుంటే, ఇప్పుడు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. $100 విలువ లోపు గిఫ్ట్‌లు లేదా డాక్యుమెంట్స్ మాత్రమే పంపగలరు. అది కూడా మరింత స్పష్టత వచ్చే వరకే.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 08:26 PM