Stock Market: 82 వేలకు సెన్సెక్స్.. వరుసగా నాలుగో రోజూ లాభాలే..
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:02 PM
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన ప్రకటన మదుపర్లలో ఆత్మవిశ్వాసం నింపింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల్లోనే పయనించాయి.
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన ప్రకటన మదుపర్లలో ఆత్మవిశ్వాసం నింపింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల్లోనే పయనించాయి. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు కూడా కలిసి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగో రోజు కూడా లాభాలను ఆర్జించాయి (Business News).
బుధవారం ముగింపు (81, 857)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 350 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. గురువారం సెన్సెక్స్ 81, 921-82,231 మధ్యలో శ్రేణి కదలాడింది. చివరకు సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 80, 000 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 33 పాయింట్ల లాభంతో 25, 083 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, మ్యాన్‌కైండ్ ఫార్మా, సిప్లా, ఏబీ క్యాపిటల్, టిటాగర్ షేర్లు లాభాలను ఆర్జించాయి. బీఎస్ఈ లిమిటెడ్, ఏంజెల్ వన్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, డాబర్ ఇండియా, వోడాఫోన్ ఐడియా షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 221 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 56 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.27గా ఉంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి