Stock Market: స్టాక్ మార్కెట్లలో రెండో రోజు భారీ నష్టాలు.. 1013 పాయింట్లు డౌన్
ABN , Publish Date - Feb 11 , 2025 | 10:18 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలు సహా మొత్తం రెడ్‌లోనే ఉన్నాయి. అయితే సూచీలు ఏ మేరకు తగ్గాయి. టాప్ 5 స్టాక్స్ ఎంటనే వివరాలను ఇక్కడ చూద్దాం.
భారత స్టాక్ మార్కెట్ (stock market) సూచీలు వారంలో రెండో రోజైన మంగళవారం కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా బెంచ్‌మార్క్ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సహా సూచీలు మొత్తం తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఉదయం 10.11 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 315.79 పాయింట్లు క్షీణించి 76,997.01 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 98 పాయింట్లు తగ్గి 23,311.25 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1013 పాయింట్లు దిగజారింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నష్టపోయారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, HDFC లైఫ్, కోల్ ఇండియా కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, అదానీ ఎంటర్‌ప్రైజ్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, HCL టెక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించాయి. దీంతో ప్రపంచపు మార్కెట్లలో అనిశ్చితి కారణంగా ట్రేడింగ్ సెంటిమెంట్స్ మిశ్రమంగా మారాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలలోని స్టాక్స్ ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గత నాలుగు సెషన్లలో ఈ రెండు సూచీలు ఏకకాలంలో 1.5% వరకు క్షీణించాయి.
ఈ కంపెనీల ఫలితాలు..
పతంజలి ఫుడ్స్
పతంజలి ఫుడ్స్ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 71% పెరిగి రూ. 371 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరంతో పోలిస్తే, ఇది గణనీయమైన వృద్ధి, ఫలితంగా ఈ కంపెనీ 2% పైగా లాభాలను రాబట్టింది.
బాటా ఇండియా
బాటా ఇండియా కూడా ఈక్విటీ మార్కెట్లో స్వల్ప లాభంతో ట్రేడవుతుంది. తన మూడో త్రైమాసిక నికర లాభం 1.2% పెరిగి రూ. 58.7 కోట్లకు చేరింది. సమీక్ష కాలంలో బాటా ఇండియా ఆదాయం 1.69% పెరిగి రూ. 918.79 కోట్లకు చేరుకుంది.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 40% తగ్గిన లాభాన్ని ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ 2024 త్రైమాసికంలో, ఈ కంపెనీ నికర లాభం రూ. 899 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ ఆదాయం 8.8% పెరిగి రూ. 34,792.9 కోట్లకు చేరుకుంది.
నైకా
నైకా కూడా తన మూడో త్రైమాసికంలో 51.3% పెరిగిన నికర లాభం రూ. 26.41 కోట్లను ప్రకటించింది. గత ఏడాది ఈ లాభం రూ. 17.45 కోట్లుగా ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం ఇది గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు.
అపోలో హాస్పిటల్స్
అపోలో హాస్పిటల్స్ 51% పెరిగిన నికర లాభం రూ. 372.3 కోట్లను ప్రకటించింది. ఈ ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ, ఈ కంపెనీ స్టాక్ 4% పడిపోయింది.
పెట్టుబడిదారులు
టారిఫ్ బెదిరింపులతోపాటు పెట్టుబడిదారులు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. వోడాఫోన్ ఐడియా, లుపిన్ వంటి పలు కంపెనీల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) నిరంతర అమ్మకాలు చేస్తున్నారు. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..
Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News