Senior Citizens Savings Scheme: రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం..ఇదిగో సులభమైన మార్గం
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:42 PM
రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త దశ వస్తుంది. ఆ సమయంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవించాలంటే, ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని నిర్వహిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలని చూస్తున్నారా. ఇది అసాధ్యమైన పనేమి కాదు. మీరు పని చేసే సమయంలో తెలివిగా పెట్టుబడి పెడితే, రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు. దీని కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు.
SCSS అంటే ఏంటి?
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది పోస్టాఫీసు ద్వారా అందుబాటులో ఉన్న ఒక పెట్టుబడి పథకం. ఇది 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకంలో ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
ఈ స్కీమ్‌లో మీరు గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి 15 లక్షలుగా ఉండేది. ఈ పథకంలో మీకు 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. అంటే, మీరు ఈ రిటర్న్‌లను 5 సంవత్సరాల పాటు పొందవచ్చు.
ఎంత ఆదాయం వస్తుంది?
ఒకవేళ మీరు 30 లక్షల రూపాయలు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మీకు సంవత్సరానికి దాదాపు 2,46,000 రూపాయల వడ్డీ లభిస్తుంది. దీన్ని నెల వారీగా లెక్కిస్తే, మీరు ప్రతి నెలా 20,500 రూపాయలు పొందవచ్చు. ఇది మీ రిటైర్మెంట్ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే స్థిరమైన ఆదాయమని చెప్పవచ్చు. దీనిలో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు.
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
55 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు, స్వచ్ఛంద రిటైర్మెంట్ తీసుకున్నవారు కూడా ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
ఈ స్కీమ్‌లో చేరడానికి మీరు మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఖాతా తెరవాలి.
ఎలా చేరాలి?
ఈ స్కీమ్‌లో చేరడం చాలా సులభం. మీరు మీ సమీప పోస్టాఫీసుకు వెళ్లి, SCSS ఖాతా తెరవడానికి అవసరమైన ఫారమ్‌ను పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి, మీ పెట్టుబడి మొత్తం గురించి వారికి తెలియజేసి అందజేయండి. ఆ తర్వాత మీ నెలవారీ ఆదాయం ప్రారంభమవుతుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే ఆదాయంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, మీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పన్ను అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి