Share News

RBI Update: ఆర్‌బీఐ నుంచి గుడ్ న్యూస్.. గాంధీ సిరీస్‌లో కొత్త 20 రూపాయల నోట్లు

ABN , Publish Date - May 17 , 2025 | 09:20 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే వీటి ప్రత్యేకత ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

RBI Update: ఆర్‌బీఐ నుంచి గుడ్ న్యూస్.. గాంధీ సిరీస్‌లో కొత్త 20 రూపాయల నోట్లు
RBI Release New rs 20 Currency

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో త్వరలోనే మహాత్మా గాంధీ సిరీస్ (కొత్తది)లో 20 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని రకాలుగా మహాత్మా గాంధీ సిరీస్ రూ. 20 నోట్లను పోలి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు గతంలో కేంద్ర బ్యాంకు జారీ చేసిన అన్ని రకాల రూ.20 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.


కొత్త నోటు డిజైన్

దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆర్‌బీఐ శనివారం ఓ నోటీస్ జారీ ప్రకటించింది. కొత్త నోటుపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని అందులో తెలిపింది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌లోని రూ. 20 నోట్లను పోలి ఉంటుందని చెప్పింది. కొత్త నోటు డిజైన్ ప్రస్తుత నోటు కంటే కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. మీరు దీనిలో కొన్ని కొత్త లక్షణాలు, రంగులను చూస్తారు. నోట్‌లో మహాత్మా గాంధీ చిత్రం మునుపటి కంటే స్పష్టంగా కనిపిస్తుంది. వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, నంబర్ ప్యాటర్న్ మరింత బలోపేతం చేయబడతాయి.


కొత్త నోట్లు ఎందుకు వస్తున్నాయి

కరెన్సీని సురక్షితంగా ఉంచడం, ఎవరూ కూడా మోసపోకుండా ఉండటమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం. దీంతోపాటు నకిలీ నోట్ల నుంచి ప్రజలను కాపాడేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు కొత్త నోట్లను జారీ చేస్తుంది. దీంతో పాటు, కొత్త గవర్నర్ నియామకం తర్వాత కూడా, ఆయన సంతకంతో నోట్లు జారీ చేయబడతాయి. ఇలాంటి సమయంలో పాత నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. కొత్త నోట్లు జారీ చేసినప్పుడు, మీరు కొత్త, పాత నోట్లను ఉపయోగించుకోవచ్చు. కొత్త నోట్లు బ్యాంకులు, ATMల ద్వారా మీకు చేరుతాయి.


ఇవి కూడా చదవండి

Tiranga Rally: ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ..పాల్గొన్న కిషన్ రెడ్డి, ఉగ్రవాదులకు అడ్డగా హైదరాబాద్


YouTuber leaks to Pakistan: పాకిస్థాన్‌కు సమాచారం.. మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు అరెస్టు..

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 09:21 PM