ITR Filing 2025: పన్ను మినహాయింపులు మిస్ అవుతున్నారా.. ఇప్పటికైనా ఈ 5 పెట్టుబడులపై ఫోకస్ చేయండి
ABN , Publish Date - Aug 29 , 2025 | 08:59 PM
ప్రతి ఏడాది లాగే, ఈసారి కూడా ఆదాయపు పన్ను (ITR) దాఖలుకు చివరి తేదీ దగ్గర పడుతోంది. గడువు సమీపించగానే డాక్యుమెంట్లు తెచ్చుకోవటం, లాగిన్ అవ్వటం… ఇదంతా చివరిదాకా వాయిదా వేసుకున్న వారికే టెన్షన్ ఉంటుంది. కానీ కొందరు మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకుని, స్మార్ట్‌గా పన్నులను తగ్గించుకుంటారు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ప్రతి ఏడాది మాదిరిగానే, ఈసారి కూడా ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing 2025) చివరి తేదీ దగ్గర పడుతోంది. కానీ కొన్నింటి విషయాల్లో మాత్రం ముందే ప్లాన్ చేసుకుని ఉంటే పన్నులు తగ్గేవని అనేక మంది భావిస్తుంటారు. కానీ చాలామంది ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఏదైనా పెట్టుబడులు చేస్తామని అనుకుంటారు. చివర్లో సమయం లేక ప్లాన్ చేయకుండా వదిలేస్తారు. అయితే ఇప్పటికైనా మీ నష్టాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఆడిట్ అవసరం లేని వ్యక్తుల కోసం ITR ఫైలింగ్ గడువు సెప్టెంబర్ 15, 2025 వరకు సమయం ఉంది. ప్రధానంగా పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకున్న వాళ్లకు Income Tax Act సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు దక్కుతాయి. ఈ ప్రయోజనాలు పొందాలంటే సరైన పెట్టుబడులు చేయాలి.
1. ఇక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS)
ఇది మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలోకి వస్తుంది. సెక్షన్ 80C కింద దీనిలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు పొందవచ్చు.
లాక్-ఇన్ పీరియడ్: 3 సంవత్సరాలు
రిటర్న్స్: మార్కెట్ ఆధారంగా వస్తాయి
ELSS మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీ డబ్బు మార్కెట్‌లో పెరిగే అవకాశం ఉంటుంది. ఒకేసారి టాక్స్ సేవింగ్స్ + లాంగ్ టెర్మ్ వెల్త్ క్రియేషన్
2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
ఇది ఎక్కువమంది గుర్తించే పెట్టుబడి మార్గం
లాక్-ఇన్ పీరియడ్: 15 సంవత్సరాలు
రాబడులు: భద్రమైనవి, సర్కార్ నిర్ణయించిన రేట్ ప్రకారం
ట్యాక్స్ ప్రయోజనం: సెక్షన్ 80C కింద మినహాయింపు, వడ్డీపై టాక్స్ లేదు
PPF అనేది రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం సరైన ఎంపిక. భద్రతా కోణంలో చూస్తే, ఇది చాలా సేఫ్ ఆప్షన్
3. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
దీని ప్రత్యేకత ఏమిటంటే Section 80CCD(1B) కింద రూ.50,000 మినహాయింపు వస్తుంది. అంటే 80Cతో కలిపితే మొత్తం రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్: ఈక్విటీ, గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్
ఎవరికి ఉపయోగం: రిటైర్మెంట్ కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్ చేసే వారికి
NPS ద్వారా మెల్లిగా మీరు మంచి కార్పస్ తయారుచేసుకోవచ్చు. పన్ను ప్రయోజనంతోపాటు భవిష్యత్తు భద్రత కూడా.
4. టాక్స్-సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (FDs)
బ్యాంకుల్లో పెట్టుబడి చేయాలనుకునే వారికి ఇది బాగుంటుంది.
లాక్-ఇన్ పీరియడ్: 5 సంవత్సరాలు
టాక్స్ ప్రయోజనం: సెక్షన్ 80C కింద
నష్టాలు: వడ్డీపై టాక్స్ వర్తిస్తుంది
కానీ తక్కువ రిస్క్ తీసే వాళ్లకు FD సేఫ్ ఆప్షన్. ముఖ్యంగా వృద్ధులకైతే FD బాగా సరిపోతుంది.
5. ఆరోగ్య బీమా ప్రీమియమ్‌లు (Health Insurance)
పన్ను మినహాయింపు ప్రయోజనంతోపాటు ఆరోగ్య రక్షణ
సెక్షన్ 80D కింద: రూ.25,000 వరకు మీకు & ఫ్యామిలీకి
అదనంగా రూ.25,000 – తల్లిదండ్రులకు (వారు సీనియర్ సిటిజన్లు అయితే రూ.50,000)
అనుకోకుండా వచ్చే మెడికల్ ఖర్చుల నుంచి రక్షణగా ఇది పనిచేస్తుంది. ట్యాక్స్ సేవింగ్‌తో పాటు మెడికల్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి