Share News

Gold Rates : బంగారం ధరలు రోజూ ఒకేలా ఎందుకుండవు.. ఈ 5 అంశాలే ప్రధాన కారణం..

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:44 PM

Gold Rates : రోజు మారిపోగానే బంగారం ధర కూడా మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఉన్నట్టుండి ఊహించనంత ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకిలా జరుగుతుంది.. ఏ కారణాల వల్ల గోల్డ్ రేట్లు రోజుకో విధంగా ఉంటాయి.. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి అని ఎందుకంటారు.. వీటన్నింటికి కారణం ఈ 5 అంశాలే అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Gold Rates : బంగారం ధరలు రోజూ ఒకేలా ఎందుకుండవు.. ఈ 5 అంశాలే ప్రధాన కారణం..
Why Gold Price Changes Everyday

Gold Rates : ప్రతిరోజూ బంగారం ధరలు చెక్ చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ, ఇలా గోల్డ్ రేట్లు రోజుకో విధంగా ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా.. హఠాత్తుగా ఒక్కరోజులోనే అమాంతం ధర పైకి ఎగబాకటం.. ఇంకోరోజు తగ్గటం.. ఇలా బంగారం ధరల్లో ప్రతి రోజూ హెచ్చుతగ్గులు నమోదు కావడానికి కారణమేంటి.. మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు ఎందుకు భావిస్తారు. ఈ 5 అంశాలే అందుకు ప్రధాన కారణం.


1. అంతర్జాతీయ బంగారం ధరలు : భారతదేశంలో బంగారం ధరలను నిర్ణయించడంలో అంతర్జాతీయ బంగారం ధరలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే, బంగారాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ట్రేడ్ చేస్తారు. అందుకే ప్రపంచ మార్కెట్లలో జరిగే ప్రతి మార్పు ప్రభావం భారతీయ మార్కెట్లపైనా పడి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.


2. రూపాయి-డాలర్ మారకం రేటు : అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. బలహీనమైన రూపాయి బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ముఖ్యంగా అమెరికా డాలర్ బలహీనపడితే వెంటనే ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడికి మొగ్గు చూపుతారు.


3. దిగుమతి సుంకం, పన్నులు : బంగారంపై దిగుమతి సుంకం, పన్నులలో మార్పులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అధిక పన్నులు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయి.


4. డిమాండ్, సరఫరా : పండుగలు, వివాహాల సమయంలో ఇండియాలో బంగారానికి డిమాండ్ ఎక్కువనే సంగతి తెలిసిందే. అందువల్లే ఈ సమయంలో గోల్డ్ రేట్లు అమాంతం పెరుగుతాయి. అలాగే తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ధరలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.


5. భౌగోళిక రాజకీయ, ఆర్థిక అంశాలు : ప్రపంచ ఆర్థిక ధోరణులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకు విధానాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఆర్థిక అనిశ్చితి తలెత్తిన సమయంలో బంగారాన్ని తరచుగా సురక్షితమైన ఆస్తిగా పరిగణిస్తాయి ప్రపంచదేశాలు.


Read Also : Meta Layoffs: మెటా సమాచారం లీక్.. 20 మందిని తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ..

Stock Market: బ్లాక్ ఫ్రైడే.. ఒక్క రోజులోనే రూ.10 లక్షల కోట్లు హాంఫట్..

Business Idea : చేతిలో రూ.10000 ఉంటే చాలు.. ఈ 5 వ్యాపారాల్లో నెలకు రూ.30వేలు గ్యారెంటీ..

Updated Date - Feb 28 , 2025 | 06:53 PM