Share News

Meta Layoffs: మెటా సమాచారం లీక్.. ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ..

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:28 PM

సంస్థకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని మీడియాకు అందించారనే కారణంతో మెటా మేనేజ్‌మెంట్ 20 మంది ఉద్యోగులను తొలగించింది. మరింత మందిని కూడా ఉద్యోగాల నుంచి తీసేయ్యబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి.

Meta Layoffs: మెటా సమాచారం లీక్.. ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ..
Meta CEO Mark zuckerberg

కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారనే కారణంతో మెటా (Meta) సంస్థ తీవ్ర చర్యలు తీసుకుంది. డేటా లీక్ చేశారనే అనుమానంతో 20 మందిని ఇళ్లకు సాగనంపింది. ముఖ్యమైన సమాచారాన్ని (Data Leak) మీడియాకు అందించారని మెటా మేనేజ్‌మెంట్ ఆ 20 మందిని తొలగించింది. మరింత మందిని కూడా ఉద్యోగాల నుంచి తీసేయ్యబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరి ఉద్యోగాలూ తీయకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది (Meta Fires 20 Employees).


సంస్థలో ఇటీవల జరిగిన అంతర్గత దర్యాఫ్తులో 20 మంది ఉద్యోగులు దోషులుగా తేలారని, వారు కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు తెలిసిందని మెటా ప్రతినిధి పేర్కొన్నారు. ఏ ఉద్దేశంతో సమాచారాన్ని లీక్ చేసినా అది కంపెనీ విధానాలకు విరుద్ధమని మెటా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే మెటాకు సంబంధించిన ఏ అంతర్గత విషయం మీడియాకు చేరిందనే విషయంలో మాత్రం సంస్థ స్పష్టత ఇవ్వలేదు.


మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల అనంతరం ఈ నిర్ణయం వెలువడడం చాలా మందికి అనుమానాలను కలిగిస్తోంది. కాగా, ఇలా లీక్ చేసిన వారు మరికొంత మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. ఇకపై, సంస్థకు సంబంధించిన విషయాలను లీక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉద్యోగులను మేనేజ్‌‌మెంట్ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి..

Stock Market: బ్లాక్ ఫ్రైడే.. ఒక్క రోజులోనే రూ.10 లక్షల కోట్లు హాంఫట్..


Business Idea : చేతిలో రూ.10000 ఉంటే చాలు.. ఈ 5 వ్యాపారాల్లో నెలకు రూ.30వేలు గ్యారెంటీ..


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2025 | 06:15 PM