Share News

Business Idea : చేతిలో రూ.10000 ఉంటే చాలు.. ఈ 5 వ్యాపారాల్లో నెలకు రూ.30వేలు గ్యారెంటీ..

ABN , Publish Date - Feb 28 , 2025 | 02:11 PM

Low Investment Business Idea : నష్టపోతామనే భయం లేదు. లోన్ తీసుకోవాల్సిన అవసరం అసలే లేదు. కేవలం పది వేల రూపాయలుంటే చాలు. ఇంటి నుంచే ఈ 5 వ్యాపారాలు ప్రారంభించి ప్రతి నెలా రూ.30వేలు సంపాదించవచ్చు. మరి, ఆ బిజినెస్ ఐడియాలోవో చూద్దామా..

Business Idea : చేతిలో రూ.10000 ఉంటే చాలు.. ఈ 5 వ్యాపారాల్లో నెలకు రూ.30వేలు గ్యారెంటీ..
5 Business Ideas for Women with ₹10,000 Budget

Low Investment Business Idea : ఈ రోజుల్లో చాలామంది ఇంటి నుంచే చేయగలిగే వ్యాపార ఆలోచనల కోసం వెతికే వారి సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మహిళలు స్వీయ ఉపాధి పొందడమెలా అని ఆలోచిస్తుంటారు. నష్టభయం లేకుండా కాలు బయటపెట్టకుండానే స్థిరమైన ఆదాయమార్గం కోసం మీరు అన్వేషిస్తుంటే.. ఈ 5 వ్యాపార ఆలోచనలు మీకోసమే. మీ చేతిలో కేవలం రూ.10 వేలు ఉంటే చాలు. స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కల కచ్చితంగా సాధ్యమే.


నేటికాలంలో మహిళలు వ్యాపార ప్రపంచంలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. తక్కువ ఖర్చుతో వ్యాపారం ప్రారంభించి ప్రతి నెలా మంచి లాభాలను సంపాదించాలని కోరుకునే మహిళల కోసం ఐదు గొప్ప వ్యాపార ఆలోచనలు.

1. క్లౌడ్ కిచెన్ బిజినెస్ : వంట చేయడానికి ఇష్టపడే మహిళలకు ఈ వ్యాపారం సరైనది. ఈ మధ్య కాలంలో హోటళ్లు, రెస్టారెంట్ల కంటే ఇంట్లో తయారుచేసిన భోజనం తినాలని ఆరాటపడేవారి సంఖ్య పెరుగుతోంది. కాబట్టి, సరైన విధానాల్లో ముందుకెళితే ఈ వ్యాపారం ద్వారా ఉద్యోగులతో సమానంగా ఇంటి నుంచే ప్రతి నెలా రూ. 15,000 నుంచి 30,000 వరకు సంపాదించవచ్చు. మార్కెటింగ్ నైపుణ్యాలు, ఆహార రుచి, నాణ్యత బాగుంటే ఇంతకంటే ఎక్కువే వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఎలా ప్రారంభించాలి:

టిఫిన్ సర్వీస్, స్వీట్లు లేదా స్నాక్స్ వంటి మీ స్పెషల్ వంటకాలపై దృష్టి పెట్టండి.

స్థానిక మార్కెట్లు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం చేసుకోండి.

పెట్టుబడి : ఆహార తయారీకి అయ్యే ముడిసరుకు, ప్యాకేజింగ్, డెలివరీ, ఇతర ఖర్చుల కోసం మొదట్లో కనీసం రూ. 10,000 పెట్టుబడి అవసరం.

లాభం: మీరు ప్రతి నెలా రూ. 15,000 నుండి 30,000 వరకు సంపాదించవచ్చు.


2. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వ్యాపారం : కొందరు మహిళలకు సృజనాత్మకంగా ఆలోచించి, చేతితో రకరకాల అందమైన వస్తువులు తయారు చేసే నైపుణ్యం ఉంటుంది. ఈ నైపుణ్యాన్నే వ్యాపార ఆలోచనగా మలచుకుంటే మంచి ఆదాయం లభిస్తుంది.

ఎలా ప్రారంభించాలి:

రాఖీ, ఆభరణాలు, బహుమతి వస్తువులు లేదా అలంకార వస్తువులను తయారు చేయండి.

వాటిని స్థానిక మార్కెట్లలో, ఉత్సవాలలో లేదా ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకానికి పెట్టండి.

పెట్టుబడి : ప్రారంభ సామాగ్రి (ఫ్యాబ్రిక్, పూసలు, రంగులు మొదలైనవి) కొనడానికి రూ. 10,000 సరిపోతుంది.

లాభం: నెలకు రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు.


3. బ్యూటీ, హెయిర్ స్టైల్: కాస్మటిక్ రంగంలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీరు ఇంటి నుంచే బ్యూటీషన్‌గా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు.

ఎలా ప్రారంభించాలి:

ప్రాథమిక మేకప్, హెయిర్ స్టైలింగ్‌లో శిక్షణ తీసుకోండి.

మీ సేవలను ఇంటి నుండే ప్రారంభించండి లేదా ఇంటింటికి సేవలను అందించండి.

పెట్టుబడి : మీరు రూ. 10,000 కు బేసిక్ మేకప్ కిట్, హెయిర్ టూల్స్ కొనుగోలు చేయవచ్చు.

లాభం: ఒక్కో కస్టమర్‌కు రూ. 500-2000 వరకు సంపాదించవచ్చు.


4. ఫిట్‌నెస్, యోగా తరగతులు : ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్, యోగా ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇంటి నుంచే ఈజీగా నిర్వహించగలిగే ఈ వ్యాపారం ద్వారా మహిళలకు ఫిట్‌నెస్, ఆదాయం రెండూ లభిస్తాయి.

ఎలా ప్రారంభించాలి:

మీరు ఫిట్‌నెస్ లేదా యోగాలో శిక్షణ పొందినట్లయితే ఇంట్లో నుంచే తరగతులు ప్రారంభించండి. ఆన్‌లైన్ తరగతులు కూడా మంచి ఎంపిక.

అవసరమైన ఖర్చు: ప్రమోషన్, ప్రారంభ సెటప్ కోసం రూ. 10,000 సరిపోతుంది.

లాభం: నెలకు రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు.


5. ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం : డిజిటల్ యుగంలో ఆన్‌లైన్‌లో ఉత్పత్తుల అమ్మకం వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. మీరు తయారుచేసినవి లేదా కొన్నవి ఏవైనా కస్టమర్లను ఆకట్టునేలా విక్రయిస్తే కష్టపడకుండానే మంచి లాభాలు దక్కించుకోవచ్చు.

ఎలా ప్రారంభించాలి:

నగలు, దుస్తులు, గృహాలంకరణ లేదా చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మండి.

ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఉత్పత్తిని ప్రచారం చేయండి.

ఖర్చు: ఉత్పత్తి కొనుగోలు మరియు డెలివరీకి రూ. 10,000.

లాభం: నెలకు రూ. 15,000 నుంచి రూ. 40,000 వరకు.


Read Also : Ministerial orders: పార్సిళ్లకు ప్లాస్టిక్‌ వద్దు.. ఇడ్లీ తయారీలోనూ గుడ్డలు మాత్రమే వాడాలి

వామ్మో.. వేడి నూనెలో చేతితో అప్పం కాల్చిన వృద్ధురాలు

హల్దీ ఫంక్షన్‌లో యువతిని టార్గెట్ చేసిన కోతి.. సడన్‌గా లోపలికి వచ్చి.. ఏం చేసిందో చూడండి..

Updated Date - Feb 28 , 2025 | 02:17 PM