Hot oil: వామ్మో.. వేడి నూనెలో చేతితో అప్పం కాల్చిన వృద్ధురాలు
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:01 PM
మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 96 యేళ్ల వృద్ధురాలు సలసల కాగే నూనెలో చేతితో అప్పం కాల్చారు. ఆ అప్పాలను అమ్మవారికి నైవేద్యంగా మర్పించారు. విరుదునగర్(Virudhunagar) జిల్లా శ్రీవిల్లిపుత్తూరు, ముదలియార్‌పట్టి వీధిలో ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో ప్రతి యేటా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తుంటారు.
చెన్నై: మహశివరాత్రి(Mahashivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని 96 యేళ్ల వృద్ధురాలు సలసల కాగే నూనెలో చేతితో అప్పం కాల్చారు. ఆ అప్పాలను అమ్మవారికి నైవేద్యంగా మర్పించారు. విరుదునగర్(Virudhunagar) జిల్లా శ్రీవిల్లిపుత్తూరు, ముదలియార్‌పట్టి వీధిలో ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో ప్రతి యేటా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలను పురస్కరించుకుని, ఊరణిపట్టి వీధికి చెందిన 96 యేళ్ల ముత్తమ్మాళ్(Muthammal) వేడి నూనెలో చేతితో అప్పాలు కాలుస్తుంటారు.
ఈ వార్తను కూడా చదవండి: Enforcement Directorate: సినీ దర్శకుడు అమీర్ ఖాతాలో డబ్బు జమ చేసిన సాధిక్

ఈ యేడాది కూడా అదేవిధంగా కాల్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా అందజేశారు. గురువారం వేకువజామున 4 గంటలకు భక్తిశ్రద్ధలతో పూజ చేసి అప్పాలు కాల్చడం ప్రారంభించి, గంటపాటు చేశారు. ఆ సమయంలో ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు ఆమెకు పాదాభివందనం చేసి, ఆశీస్సులు తీసుకున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
Read Latest Telangana News and National News