Share News

Gold and Silver Rates Today: బంగారం, వెండి కొంటున్నారా.. ఈ రేట్లు తెలుసుకుని వెళ్లండి..

ABN , Publish Date - Feb 12 , 2025 | 06:26 AM

దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం, వెండి ధరలు పైపైకి చేరుతున్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు ఆలోచించాల్సి వస్తుంది. అయితే నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: బంగారం, వెండి కొంటున్నారా.. ఈ రేట్లు తెలుసుకుని వెళ్లండి..
gold silver rates february 12th 2025

ఈరోజు (february 12th 2025) మీరు బంగారం(gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి రేట్లను తెలుసుకుని వెళ్లండి మరి. ఎందుకంటే వీటి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఉదయం 6.15 గంటలకు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87,540గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 80,620 స్థాయికి చేరుకుంది.

మరోవైపు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,390కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,110గా ఉంది. ఇక వెండి రేటు విషయానికి వస్తే హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 97,400గా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ చుద్దాం.


దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • చెన్నైలో రూ. 87,390, రూ. 80,110

  • వడోదరలో రూ. 87,440, రూ. 80,160

  • ఢిల్లీలో రూ. 87,540, రూ. 80,620

  • ముంబైలో రూ. 87,390, రూ. 80,110

  • విజయవాడలో రూ. 87,390, రూ. 80,110

  • హైదరాబాద్‌లో రూ. 87,390, రూ. 80,110

  • కేరళలో రూ. 87,390, రూ. 80,110

  • బెంగళూరులో రూ. 87,390, రూ. 80,110

  • కోల్‌కతాలో రూ. 87,390, రూ. 80,110

  • పూణేలో రూ. 87,390, రూ. 80,110


బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు.


ఇవి కూడా చదవండి:


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..

Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 12 , 2025 | 10:36 AM