Share News

Gold Prices: షాకింగ్.. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధరలు..

ABN , Publish Date - Feb 10 , 2025 | 08:02 PM

దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ, పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే తాజాగా గోల్డ్ రేటు భారీగా పుంజుకుని, ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Gold Prices: షాకింగ్.. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధరలు..
Gold Prices Surge by rs 2430

దేశంలో సోమవారం బంగారం (gold) ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 2,430 పెరిగి రూ. 88,500కు చేరుకుంది. దీంతో ఇది ఆల్ టైం రికార్డు స్థాయి ధరగా నిలిచింది. బంగారం ధరల పెరుగుదలకి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన ట్రెండ్, భారత రూపాయి విలువ తగ్గిపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని నిపుణులు చెబుతున్నారు.


ప్రధాన కారణం...

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం గోల్డ్ రేట్లపై ప్రభావం చూపించింది. ఈ క్రమంలో అమెరికా దేశంలోకి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పైపైకి చేరుకున్నాయి. తద్వారా మార్కెట్లో ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. అమెరికా నిర్ణయం తరువాత బంగారం స్పాట్ ధర $2,900 (రికార్డ్ స్థాయి)కి చేరుకుంది. ఇది బంగారం కొనుగోలు ధరలు మరింత పెరిగేందుకు కారణమైంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా బంగారం సహా ఇతర విలువైన లోహాల ధరల పెరుగుదలకు కూడా దారితీసింది.


మరోవైపు వెండి రేట్లు..

ఈ పరిణామాలు భారత మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ. 86,070 వద్ద ముగిసింది. కానీ తాజా ధరలు రూ. 2,430 పెరిగి 10 గ్రాములకు రూ. 88,500 చేరుకున్నాయి. ఇది దేశవ్యాప్తంగా బంగారం ధరల చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచాయి. అలాగే స్థానిక మార్కెట్లలో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా భారీగా పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల ధర రూ. 88,100 చేరింది. ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది. ఇదే సమయంలో సిల్వర్ ధర కూడా పెరిగింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి ధర కిలోకు రూ.1,000 పెరిగి రూ.97,500కు చేరుకుంది.


ఇతర కారణాలు..

ఇదే సమయంలో భారత రూపాయి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనపడింది. రూపాయి బలహీనత, ఆర్థిక అస్థిరతలు, ఇతర అంశాలు కూడా బంగారం ధరల పెరుగుదలకి దారితీశాయి. మరోవైపు ఆభరణాల విక్రేతలు, రిటైలర్లు భారీగా బంగారం కొనుగోళ్లు చేయడం కూడా ధరలను మరింత పెంచిందని చెబుతున్నారు. ముఖ్యంగా రిటైల్ విక్రేతలు చెలామణి అయ్యే స్టాక్‌లను పుష్కలంగా కొనుగోలు చేస్తున్నారు. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది. ఈ క్రమంలో ప్రస్తుత స్థితిగతులను పరిశీలిస్తే భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

Stock Market: 1138 పాయింట్లు పడిపోయిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల ఆందోళన..


Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 08:19 PM