Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం, తగ్గిన వెండి.. ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:40 AM
దేశంలో పెరిగిన బంగారం, వెండి ధరల నేపథ్యంలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి ఈ రేట్లు తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే నిన్న తగ్గిన వీటి ధరలు, ఈరోజు మాత్రం పుంజుకున్నాయి. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 14న) ఉదయం 6.25 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి, రూ. 87, 060కి చేరుకుంది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 79, 810 స్థాయికి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 87, 210కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 79, 960కి చేరుకుంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87, 060కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 79, 810కి చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ఢిల్లీలో రూ. 79,960, రూ. 87,210
చెన్నైలో రూ. 79, 810, రూ. 87, 060
వడోదరలో రూ. 79,860, రూ. 87,110
ముంబైలో రూ. 79, 810, రూ. 87, 060
విజయవాడలో రూ. 79, 810, రూ. 87, 060
హైదరాబాద్‌లో రూ. 79, 810, రూ. 87, 060
కేరళలో రూ. 79, 810, రూ. 87, 060
బెంగళూరులో రూ. 79, 810, రూ. 87, 060
కోల్‌కతాలో రూ. 79, 810, రూ. 87, 060
పూణేలో రూ. 79, 810, రూ. 87, 060
వెండి రేట్లు
మరోవైపు వెండి రేట్లు ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కిలోకి వంద రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 99,400కు చేరుకుంది. దీంతో హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి రేటు రూ. 106, 900 స్థాయికి చేరుకుంది.
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు.
ఇవి కూడా చదవండి:
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
Read More Business News and Latest Telugu News