Gold Rates on Dec 21: పరుగు ఆపని పసిడి.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:46 AM
హాలిడ్ సీజన్ మొదలు కానుండటంతో ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గనున్నాయి. అయితే, ఈ నెలాఖరు వరకూ స్థూలంగా బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్సులు అధికంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ధరల్లో దాదాపు 60 శాతం పెరుగుదల కనిపించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లో ధరలు అప్పుడప్పుడూ కాస్త తగ్గినట్టు అనిపించినా స్థూలంగా పెరుగుదలే కనిపించింది. ఇక త్వరలో క్రిస్మస్ హాలిడే సీజన్ మొదలు కానుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు స్వల్పంగా ఉండే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,180గా ఉంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ ధర రూ.1,23,000కు చేరుకుంది. వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,14,000 వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Prices on Dec 21).
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 4,338 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 67 డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడాది ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫెడ్ రేట్ కోతపై అంచనాలు పెరగడం, వెండి సరఫరా కొరత, భౌగోళిక అనిశ్చితులు వంటివి ధరలను పరుగులు పెట్టించనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,35,280; ₹1,24,000; ₹1,03,450
ముంబై: ₹1,34,180; ₹1,23,000; ₹1,00,640
న్యూఢిల్లీ: ₹1,34,330; ₹1,23,150; ₹1,00,790
కోల్‌కతా: ₹1,34,180; ₹1,23,000; ₹1,00,640
బెంగళూరు: ₹1,34,180; ₹1,23,000; ₹1,00,640
హైదరాబాద్: ₹1,34,180; ₹1,23,000; ₹1,00,640
విజయవాడ: ₹1,34,180; ₹1,23,000; ₹1,00,640
కేరళ: ₹1,34,180; ₹1,23,000; ₹1,00,640
పుణె: ₹1,34,180; ₹1,23,000; ₹1,00,640
వడోదరా: ₹1,34,230; ₹1,23,050; ₹1,00,690
అహ్మదాబాద్: ₹1,34,230; ₹1,23,050; ₹1,00,690
కిలో వెండి ధరలు
చెన్నై: ₹2,26,000
ముంబై: ₹2,14,000
న్యూఢిల్లీ: ₹2,14,000
కోల్‌కతా: ₹2,14,000
బెంగళూరు: ₹2,14,000
హైదరాబాద్: ₹2,26,000
విజయవాడ: ₹2,26,000
కేరళ: ₹2,26,000
పుణె: ₹2,14,000
వడోదరా: ₹2,14,000
అహ్మదాబాద్: ₹2,14,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి
పోస్ట్ ఆఫీస్‌లో బెస్ట్ స్కీం, నెలకు రూ. 500 డిపాజిట్ చేస్తే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి