Share News

Investments: పోస్ట్ ఆఫీస్‌లో బెస్ట్ స్కీం, నెలకు రూ. 500 డిపాజిట్ చేస్తే..

ABN , Publish Date - Dec 20 , 2025 | 03:07 PM

పొదుపు ప్రతీ ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన రూల్ పోషిస్తుంది. నిత్యజీవితంలో పొదుపు చేస్తూ, ఆమేరకు పెట్టుబడుల్లో పెట్టగలిగితే, దీర్ఘకాలంలో ఒడిదుడుకులు లేని.

Investments: పోస్ట్ ఆఫీస్‌లో బెస్ట్ స్కీం, నెలకు రూ. 500 డిపాజిట్ చేస్తే..
Small Savings Scheme India

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 20: పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పథకం మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వయస్కుల వారికి అనువైంది. ఈ చిన్న పొదుపు పథకం. మంచి వడ్డీ రేట్లను అందించడమే కాకుండా,పెట్టుబడికి ప్రభుత్వ హామీ ఉండడం మరింత సానుకూలం.

చిన్న మొత్తాలతో పొదుపు ప్రారంభించి, దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందాలనుకునే వారికి ఈ పథకం అనుకూలం. పెట్టుబడిదారులకు ఎలాంటి రిస్క్ లేని, పన్ను మినహాయింపులు అందించే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం పెట్టుబడిదారులలో అత్యంత ప్రజాదరణ పొందుతోంది.

G8bcSsNakAQIrF8.jpg


PPF పథకంపై సంవత్సరానికి 7.1 శాతం పన్ను రహిత వడ్డీని అందిస్తోంది. ఇది అధిక పన్ను శ్లాబ్‌లో ఉన్న వారికి కూడా ఎంతో లాభదాయకం. ఈ పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఈ పథకానికి 15 సంవత్సరాల లాక్-ఇన్ కాలం ఉండగా, కనీసంగా సంవత్సరానికి రూ. 500తో ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.


నెలకు రూ. 12,500 చొప్పున పెట్టుబడి పెడితే, సంవత్సరానికి రూ. 1.50 లక్షల గరిష్ట పెట్టుబడితో 15 సంవత్సరాలలో మీ మొత్తం డిపాజిట్ రూ. 22,50,000 అవుతుంది.

ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం, ఈ కాలంలో మీరు పొందే వడ్డీ మొత్తం సుమారు రూ. 18,18,209 ఉంటుంది. ఫలితంగా మెచ్యూరిటీ సమయంలో మీకు అందే మొత్తం దాదాపు రూ. 40,68,209 అవుతుంది.

మెచ్యూరిటీ అయిన 15 ఏళ్ల తర్వాత కూడా ఈ ఖాతాను కొనసాగించాలనుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రతి సారి ఐదు సంవత్సరాల చొప్పున ఖాతాను పొడిగించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పెట్టుబడిదారులు మరింత లాభాలు పొందొచ్చు.


ఇవి కూడా చదవండి:

ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!

నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్

Read Latest and Health News

Updated Date - Dec 20 , 2025 | 03:18 PM