NPS reforms 2025: ఎన్‌పీఎస్ మరింత ఆకర్షణీయం
ABN , Publish Date - Sep 28 , 2025 | 06:20 AM
పూర్తి ఈక్విటీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ఫ అక్టోబరు నుంచే అమలు వచ్చే నెల 1 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎ్‌స)లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి....
పూర్తి ఈక్విటీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ఫ అక్టోబరు నుంచే అమలు వచ్చే నెల 1 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎ్‌స)లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మదుపరులకు పెట్టుబడుల విషయంలో అనేక ఐచ్ఛికాలు, వెసులుబాట్లు లభించబోతున్నాయి. ఈ మార్పులు, చేర్పులు ఏమిటో ఒక లుక్కేద్దాం.
ప్రభుత్వేతర ఉద్యోగుల రిటైర్‌మెంట్ ప్రయోజనాల కోసం 2009లో ప్రవేశపెట్టిన ఎన్‌పీఎ్‌స పథకం అనేక మంది ఆదరణ చూరగొంది. ప్రైవేటు రంగంతో పాటు స్వయం ఉపాధిలో ఉన్న అనేక మంది వృత్తి నిపుణులకూ ఈ పథకం చక్కటి రిటైర్‌మెంట్ ఇన్వె్‌స్టమెంట్ మార్గంగా మారిందంటే ఆశ్చర్యం లేదు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది. అక్టోబరు 1 నుంచి ఈ పథకంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవేమిటంటే?
ఈక్విటీ పెట్టుబడుల ఆప్షన్
ప్రస్తుత ఎన్‌పీఎ్‌స నిబంధనల ప్రకారం మదుపరులు తమ వయసు ఆధారంగా 25 నుంచి 75 శాతం పెట్టుబడులను ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అక్టోబరు 1 నుంచి ఎన్‌పీఎ్‌సలోని ప్రభుత్వేతర ఉద్యోగులు తమ వయసుతో సంబంధం లేకుండా మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎంఎ్‌సఎఫ్) ద్వారా 100 శాతం ఈక్విటీ పెట్టుబడి ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు ఢోకా లేని మదుపరులకు మాత్రమే ఈ ఆప్షన్ మేలు చేస్తుంది. మార్కెట్ ఆటుపోట్లకు తట్టుకోలేని స్థిర ఆదాయం కోరుకునే మదుపరులు ఈ ఆప్షన్ జోలికి పోకపోవడమే మంచిది.
ఎంఎ్‌సఎఫ్ అంటే?
ఇప్పటి వరకు ఒక పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) కింద ఒక స్కీమ్‌ను మాత్రమే అనుమతించేవారు. అక్టోబరు 1 నుంచి కొత్తగా ఎంఎ్‌సఎఫ్ అమల్లోకి వస్తోంది. దీంతో ఇక ఒకే సమయంలో వివిధ సెంట్రల్ రికార్డ్ ఏజెన్సీ (సీఆర్‌ఏ)ల ద్వారా ఒకే ‘ప్రాన్’తో మన పెట్టుబడి స్కీమ్‌లను నిర్వహించుకోవచ్చు. దీనివల్ల మదుపరులకు తమ పెట్టుబడుల నిర్వహణకు సంబంధించి మరింత వెసులుబాటు, చాయిస్‌లు ఏర్పడతాయి.
ఇతర ప్రతిపాదిత మార్పులు
అక్టోబరు 1 నుంచి ఎన్‌పీఎ్‌స పెట్టుబడుల ఎగ్జిట్, విత్‌డ్రాయల్స్ మరింత సులభతరం కానున్నాయి. దీనికి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్‌పమెంట్ అఽథారిటీ (పీఎ్‌ఫఆర్‌డీఏ) ఇటీవల మారిన నిబంధనలతో ఒక ముసాయిదా పత్రం కూడా విడుదల చేసింది.
ప్రభుత్వేతర ఉద్యోగుల ఎగ్జిట్
ఇప్పటి వరకు 60 ఏళ్ల వయసు లేదా ఎక్కువ కాలం ఎన్‌పీఎ్‌సలో ఉన్న ప్రభుత్వేతర ఉద్యోగులకు మాత్రమే ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. అక్టోబరు 1 నుంచి ఎన్‌పీఎ్‌సలో 15 ఏళ్లు పూర్తయిన ప్రభుత్వేతర ఉద్యోగులూ ఎగ్జిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మధ్యలో నగదు అవసరమైన ఖాతాదారులకు ఈ మార్పు ఎంతో మేలు చేయనుంది.
విత్‌డ్రాయల్స్
మారిన కొత్త నిబంధనల ప్రకారం రిటైర్‌మెంట్ నాటికి ఎన్‌పీఎ్‌సలో పోగైన మొత్తం రూ.5 లక్షలకు మించి ఉంటే, అందులో 60 శాతాన్ని, రూ.5 లక్షల లోపు ఉంటే పూర్తి మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. జమ అయిన మొత్తం రూ.2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండి మధ్యలోనే వెనక్కి తీసుకోవాలనుకుంటే మాత్రం పోగైన మొత్తంలో 80 శాతంతో యాన్యుటీ కొనుగోలుతో మిగతా మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారులు చనిపోతే మాత్రం వారి వారసులు రూ.2.5 లక్షల మొత్తాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు.
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి