IndiGo Airlines: పెరిగిన ఇండిగో నష్టాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:54 AM
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో రూ. 2,582.10 కోట్ల నికర నష్టాన్ని...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో రూ. 2,582.10 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. విదేశీ మారక (ఫారెక్స్) నష్టాలు, వ్యయా లు లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపించాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నష్టాలు రూ. 986.7 కోట్లుగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో రూ. 2,176.30 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 10 వృద్ధితో రూ.17,759 కోట్ల నుంచి రూ.19,599.5 కోట్లకు పెరిగింది.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి