Sensex 100000 Target: వచ్చే జూన్ నాటికి సెన్సెక్స్ 100000
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:40 AM
దేశీయ స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్‌కు తెరపడిందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు కూడా ఇదే అంచనాకు వస్తున్నాయి. మార్కెట్‌పై బుల్ ఆపరేటర్లు..
మార్కెట్లో కరెక్షన్ దశ ముగిసింది, ఇక దూకుడే
మోర్గాన్ స్టాన్లీ అంచనా
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్‌కు తెరపడిందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు కూడా ఇదే అంచనాకు వస్తున్నాయి. మార్కెట్‌పై బుల్ ఆపరేటర్లు పట్టు బిగించి, పెద్ద అడ్డంకులేమీ లేకపోతే వచ్చే ఏడాది జూన్ నాటికి బీఎ్‌సఈ సెన్సెక్స్ లక్ష పాయింట్ల మైలురాయిని చేరుకుంటుందని మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో అంచనా వేసింది. సెన్సెక్స్ ప్రస్తుత స్థాయితో పోలిస్తే ఇది 16,541 పాయింట్లు ఎక్కువ. ఒక వేళ చిన్నపాటి అడ్డంకులు ఎదురైనా ప్రస్తుత స్థాయి నుంచి 6.6 శాతం వృద్ధితో 89,000 పాయింట్లను తాకడానికి 50 శాతం అవకా శం ఉందని తెలిపింది. తమ అంచనాలు తలకిందులై మార్కెట్‌పై బేర్ పట్టు పెరిగితే మాత్రం సెన్సెక్స్ ఇప్పుడున్న స్థాయి నుంచి 16 శాతం నష్టపోయి 70,000 పాయింట్లకు పడిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. అయితే వచ్చే ఎనిమిది నెలల్లో భారత స్టాక్ మార్కెట్‌పై బేర్ పట్టుకు 20 శాతం మాత్రమే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ అంచనా.
మారుతున్న పరిస్థితులు: నిన్న మొన్నటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్ అనేక ఆటుపోట్లకు లోనైంది. మదుపరులు కూడా ఎంపిక చేసిన కొన్ని మంచి కంపెనీల షేర్లలోనే ఇన్వెస్ట్ చేసే వారు. మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మదుపరుల పెట్టుబడుల వ్యూహం సైతం మారుతోందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధితో పాటు అభివృద్ధి పథంలోని కంపెనీల షేర్లపై వారు ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాల పోటు భయపెడుతున్నా, మిగతా దేశాలతో పోలిస్తే భారత జీడీపీ వృద్ధిరేటు ఆశాజనకంగా కనిపిస్తోందని ఈ నివేదిక రూపొందించిన మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఎండీ, చీఫ్ ఈక్విటీ స్ట్రాటజిస్టు రిథం దేశాయ్, నయంత్ పరేఖ్ తెలిపారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలతో పాటు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు, నగదు నిల్వల నిష్ప త్తి (సీఆర్‌ఆర్) తగ్గించడం, బ్యాంకుల డీరెగ్యులేషన్, పెరగనున్న లిక్విడిటీ, జీఎ్‌సటీ రేట్ల కుదింపు సైతం దేశీయ స్టాక్ మార్కెట్‌కు కలిసి వస్తాయని వీరి అంచనా.
ఇతర సానుకూల అంశాలు : చైనాతో మెరుగుపడుతున్న సంబంధాలు, భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మెరుగుపుతున్న ఆశలు, పెరుగుతున్న ఎగుమతులు, నిలకడగా ఉన్న ముడి చమురు ధరలు, అదుపులో ఉన్న ద్రవ్య లోటు కూడా సెంటిమెంట్‌ను మరింత పెంచుతాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా. ఈ సానుకూల అంశాలన్నీ కలిసి కుటుంబాల పొదుపులో ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్‌వైపు ఆకర్షించే అవకాశం ఉందని పేర్కొంది.
ఇబ్బందులూ ఉన్నాయ్: సానుకూలాంశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్‌కు కొన్ని ప్రతికూల అం శాలూ పొంచి ఉన్నట్టు మోర్గాన్ స్టాన్లీ నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా నీరసిస్తున్న ప్రపంచ వృద్ధిరేటు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్లకు పొంచి ఉన్న పెద్ద ముప్పు అని తెలిపింది. ఎఫ్‌పీఐల వెనుకంజ కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మెరిసే కంపెనీల షేర్లు : దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ ప్రారంభమైతే ఈ కింది కంపెనీల షేర్లు మంచి లాభాలు పంచే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
మారుతి సుజుకీ
ట్రెంట్, టైటాన్
వరుణ్ బేవరేజెస్
రిలయన్స్ ఇండస్ట్రీస్
బజాజ్ ఫైనాన్స్
ఐసీఐసీఐ బ్యాంక్
ఎల్ అండ్ టీ.
అలా్ట్రటెక్ సిమెంట్
కోఫోర్జ్ లిమిటెడ్.
ఇవీ చదవండి:
Investors Wealth: రూ 2 లక్షల 71 కోట్ల సంపద నష్టం
మార్కెట్లో హ్యుండయ్ సరికొత్త వెన్యూ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి