Sensex Rises: రూ. 5.42 లక్షల కోట్ల సంపద వృద్ధి
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:24 AM
వరుసగా నాలుగు రోజులు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతంలో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 585.69 పాయింట్ల వరకు...
448 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: వరుసగా నాలుగు రోజులు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతంలో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 585.69 పాయింట్ల వరకు ఎగబాకి 85,067.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 447.55 పాయింట్ల లాభంతో 84,929.36 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 150.85 పాయింట్ల వృద్ధితో 25,966.40 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎన్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.5.42 లక్షల కోట్లు పెరిగి రూ.471..21 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ సహా పలు బ్లూచిప్ షేర్లలో మదుపరులు వాల్యూ బైయింగ్‌కు పాల్పడటం ఇందుకు ప్రధానంగా దోహదపడింది.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్