Share News

Major Changes in NPS Rules: ఎన్‌పీ‌ఎస్ రూల్స్‌ మారాయి

ABN , Publish Date - Dec 21 , 2025 | 05:59 AM

జాతీయ పింఛన్‌ వ్యవస్థ (ఎన్‌పీ‌ఎస్) నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఈ సవరణలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా...

Major Changes in NPS Rules: ఎన్‌పీ‌ఎస్ రూల్స్‌ మారాయి

జాగ్రత్తగా తెలుసుకోండి

జాతీయ పింఛన్‌ వ్యవస్థ (ఎన్‌పీ‌ఎస్) నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఈ సవరణలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. యాన్యుటీల పరిమితిని 20 శాతానికి కుదించడం, 85 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎన్‌పీఎస్‌లో కొనసాగేందుకు అనుమతించడం, కనీసం ఆరేళ్ల పాటు సిస్టమిక్‌ యూనిట్‌ రిడంప్షన్‌ను అనుమతించడం ప్రధాన మార్పులు. మొత్తం మీద ఎన్‌పీఎ్‌సలో పది ప్రధాన మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేమిటంటే..

85 ఏళ్ల వరకు కొనసాగడం..

ఇప్పటి వరకు ఎన్‌పీఎ్‌స చందాదారులను 75 ఏళ్ల గరిష్ఠ వయసు వరకే ఈ పథకంలో కొనసాగేందుకు అనుమతించేవారు. ఇప్పుడు ఈ వయోపరిమితిని 85 ఏళ్లకు పెంచారు. ఈ వయసు తర్వాత తమ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఒకేసారి లేదా దశల వారీగా వెనక్కి తీసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వేతర (ప్రైవేట్‌) ఉద్యోగులు ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక స్థిరత్వం ఉన్న ఎన్‌పీఎ్‌స చందాదారులకు ఇది బాగా ఉపయోగపడనుంది.

యాన్యుటీల కొనుగోలు..

ఇంతకు ముందు ప్రభుత్వేతర ఉద్యోగులు రిటైర్మెంట్‌ తర్వాత లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో తమ ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.5 లక్షలకు మించి ఉంటే.. అందులో 40 శాతం యాన్యుటీల కొనుగోలుకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని 20 శాతానికి కుదించారు.

100 శాతం వెనక్కి..

కొత్త నిబంధనల ప్రకారం కొన్ని కేసుల్లో చందాదారులు 100 శాతం మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. రిటైర్మెంట్‌ నాటికి ఎన్‌పీఎ్‌స ఖాతాలో పోగైన మొత్తం రూ.8 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉన్న కేసుల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే తమ ఖాతాల్లోని మొత్తంలో కనీసం 40 శాతంతో, ప్రైవేట్‌ ఉద్యోగులైతే తమ ఖాతాల్లోని మొత్తంలో 20 శాతం కనీస మొత్తంతో యాన్యుటీలు కొనుగోలు చేసే ఆప్షన్‌ కల్పించారు.


మరిన్ని విత్‌డ్రాయల్స్‌..

ఎన్‌పీఎ్‌స చందాదారులు ఇక రిటైరయ్యేలోపు అంటే 60 ఏళ్ల లోపు లేదా సూపర్‌యాన్యుయేషన్‌ లోపు నాలుగు విడతల వరకు తమ ఎన్‌పీఎ్‌స ఖాతా నుంచి సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఒక విత్‌డ్రాయల్‌కు మరో విత్‌డ్రాయల్‌కు మధ్య కనీసం నాలుగేళ్ల వ్యవధి ఉండాలి. ఇంతకు ముందు ఇది మూడేళ్లుగా ఉండేది.

60 ఏళ్ల వయసు తర్వాత విత్‌డ్రాయల్స్‌

పదవీ విరమణ లేదా 60 ఏళ్ల తర్వాత కూడా కొంతమంది ఎన్‌పీఎ్‌సలో చందాదారులుగా కొనసాగుతారు. వీరు కూడా మూడేళ్లకు ఒకసారి తమ చందా మొత్తం నుంచి 25 శాతం వెనక్కి తీసుకోవచ్చు.

పౌరసత్వం వదులుకుంటే..

ఎన్‌పీఎ్‌స చందాదారులు ఎవరైనా భారత పౌరసత్వం వదులుకుంటే ఆ వ్యక్తి తన ఎన్‌పీఎ్‌స ఖాతాను క్లోజ్‌ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఖాతాలో జమైన మొత్తాన్ని వారికి ఒకేసారి చెల్లిస్తారు.

కనిపించకుండా పోయిన లేదా చనిపోయారని భావించే వ్యక్తుల విషయంలో..

ఇలాంటి వ్యక్తుల నామినీలు లేదా చట్టబద్ద వారసులకు, అప్పటి వరకు జమ అయిన మొత్తంలో 20 శాతాన్ని ఒకేసారి తాత్కాలిక ఊరటగా చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని చట్టపరంగా నిర్ధారించుకున్న తర్వాత చెల్లిస్తారు.

ఖాతా ఆధారితం

ప్రతి ఎన్‌పీఎ్‌స ఖాతాకు ‘శాశ్వత రిటైర్మెంట్‌ ఖాతా (పీఆర్‌ఏ)’ పేరుతో ఒక నంబరు కేటాయిస్తారు. దీంతో ఖాతాదారుడి వివరాల గుర్తింపు తేలికవుతుంది.

కొత్త శ్లాబులు..

ఎన్‌పీఎ్‌స ఖాతాల్లో రిటైరయ్యే నాటికి రూ.8 లక్షల పైన, రూ.12 లక్షల వరకు జమ అయిన వారి విత్‌డ్రాయల్స్‌ కోసం కొత్త శ్లాబులు ప్రవేశపెట్టారు. ఈ శ్లాబుల ప్రకారం....

ఆప్షన్‌ 1: ఒకేసారి రూ.6 లక్షల వరకు వెనక్కి తీసుకుని మిగతా మొత్తాన్ని ఎస్‌యూఆర్‌ల రూపంలో ఆరేళ్లలో వెనక్కి తీసుకోవచ్చు.

ఆప్షన్‌ 2: ఒకేసారి రూ.6 లక్షల వరకు వెనక్కి తీసుకుని, మిగతా మొత్తంతో యాన్యుటీలు కొనుగోలు చేసుకోవడం.

ఆప్షన్‌ 3: రిటైర్మెంట్‌ ఖాతాలోని మొత్తంలో 60 శాతం వరకు ఒకేసారి పన్నుల బారిన పడకుండా వెనక్కి తీసుకుని మిగిలిన మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయడం.

ప్రభుత్వేతర ఉద్యోగులు మొదటి రెండు ఎగ్జిట్‌ ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు. మూడో ఆప్షన్‌ ఎంచుకంటే మాత్రం వీరు 20 శాతం కార్ప్‌సతో యాన్యుటీలు కొని, మిగతా 80 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు.

సిస్టమిక్‌ యూనిట్‌ రిడంప్షన్‌..

ఎన్‌పీఎ్‌సను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్తగా సిస్టమిక్‌ యూనిట్‌ రిడంప్షన్‌ (ఎస్‌యూఆర్‌) ఆప్షన్‌ ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) అమలు చేస్తున్న సిస్టమిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్స్‌ (ఎస్‌డబ్ల్యూపీ) లాంటిది. అయితే ఈ ఆప్షన్‌ రిటైరయ్యే నాటికి తమ ఖాతాల్లో రూ.8 లక్షల పైన, రూ.12 లక్షల లోపు ఉన్న ఎన్‌పీఎ్‌స చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇలాంటి చందాదారులు ఒకేసారి రూ.6 లక్షల వరకు వెనక్కి తీసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని ఎస్‌యూఆర్‌ ఖాతాకి మళ్లించి ఆరేళ్లలో వెనక్కి తీసుకోవాలి.

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ ప్యాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎ్‌ఫ)ను ప్రారంభించింది. ఇది బంగారం, వెండి ఈటీఎఫ్‌ యూనిట్లలో పెట్టుబడులు పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ ఎఫ్‌ఓఎఫ్‌ పథకం. దేశీయంగా ఉన్న వెండి, బంగారం ధరలు ఈ ఫండ్‌కు బెంచ్‌మార్క్‌గా ఉండనున్నాయి. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.100. ముగింపు తేదీ ఈ నెల 22.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యూలిప్స్‌) కింద కొత్తగా సెక్టార్‌ లీడర్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. 20కి పైగా కీలక రంగాల్లోని కీలక కంపెనీల్లో మదుపరులు పెట్టుబడులు పెట్టే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిద్డిద్దింది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.1,000.

ఇవి కూడా చదవండి:

ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!

నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్

Read Latest and Health News

Updated Date - Dec 21 , 2025 | 05:59 AM