Gold And Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..నగరాల వారీగా రేట్లు
ABN , Publish Date - Aug 25 , 2025 | 06:47 AM
దేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 24 క్యారెట్ల పసిడి ధరలు ఇప్పటికే లక్ష రూపాయలను బీట్ చేయగా, తాజాగా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాల వారీగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో బంగారం, వెండి ధరలు లక్ష రూపాయల స్థాయి నుంచి దిగి రావడం లేదు. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 25న గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి (gold silver prices on august 25 2025).
ఈ నేపథ్యంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,01,610కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,140 వద్ద నిలిచింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,19,900కు చేరుకుంది.
నగరాల వారీగా బంగారం ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థానిక డిమాండ్, సరఫరా, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140, 24 క్యారెట్ల ధర రూ.1,01,610గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.93,140, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా కలదు. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా ఉంది. చెన్నైలో కూడా 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.93,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ.1,01,610గా నమోదైంది.
వెండి ధరల పరిస్థితి
వెండి ధరలు కూడా బంగారంతో పాటు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర రూ.100 తగ్గిపోయి రూ.1,19,900కు చేరుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,29,900గా ఉండగా, విజయవాడలో రూ.1,29,900, విశాఖపట్నంలో కేజీ వెండి రూ.1,29,900గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి రూ.1,19,900, చెన్నైలో కేజీ వెండి రూ.1,29,900గా ఉంది. ఢిల్లీ, ముంబయిలో కూడా కేజీ వెండి రేటు రూ.1,19,900 స్థాయిలో కలదు. అయితే స్థానిక మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు మారవచ్చు.
ధరల మార్పునకు కారణాలు
బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి మారుతుంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆగస్టు 20న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,150గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.91,800గా ఉండేది. అంటే గత ఐదు రోజుల్లోనే దాదాపు 1460 రూపాయలు పెరిగింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి