Share News

EPFO Update: త్వరలో EPFO 3.0 ప్రారంభం.. దీని స్పెషల్ ఏంటంటే

ABN , Publish Date - Aug 28 , 2025 | 04:19 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి 3.0 పేరుతో మరో కీలక అప్డేట్ రాబోతుంది. ఈ అప్‌గ్రేడ్ దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా సభ్యులకు వేగవంతమైన సేవలను అందించడానికి రూపొందించబడింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

EPFO Update: త్వరలో EPFO 3.0 ప్రారంభం.. దీని స్పెషల్ ఏంటంటే
EPFO Update

మీ పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను మరింత ఈజీగా యాక్సెస్ చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు EPFO 3.0 రాబోతోంది. దీనిని మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ముందుగా EPFO 2.0 వర్షన్ వస్తుంది. దానికి మోడర్న్ టచ్ ఇస్తూ, మరింత వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఇది కూడా రానుంది. ఇన్ఫోసిస్, విప్రో, TCS లాంటి ప్రముఖ ఐటీ సంస్థలు దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి.


EPFO 3.0లో ఏం స్పెషల్ ఉన్నాయో ఇక్కడ చూద్దాం

ATM నుంచే PF విత్‌డ్రా చేసుకునే సౌకర్యం లభిస్తుంది. EPFO 3.0తో మీరు మీ PF డబ్బు ATM ద్వారా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకోసం మీరు UAN (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) యాక్టివేట్ చేసుకొని, మీ ఆధార్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకుని ఉండాలి. ఆ తర్వాత మీ కార్డుతో ATMకి వెళ్లి, అవసరమైన మేరకు డబ్బు తీసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది.


UPI ద్వారా కూడా విత్‌డ్రా

డిజిటల్ యుగానికి తగ్గట్లు UPI పేమెంట్‌ గేట్‌వే ద్వారా కూడా PF మనీ తీసుకోవచ్చు. ఇకపై మీ Google Pay, PhonePe, Paytm లాంటి యాప్స్‌ ద్వారా కూడా మీ PFను యాక్సెస్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలని చూసినా, బ్యాంక్ డీటెయిల్స్ అప్‌డేట్ చేసుకోవాలన్నా ఈజీ అవుతుంది. ఇకపై ఇలాంటి మార్పులకోసం EPFO ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు. EPFO 3.0తో OTP ద్వారా వెరిఫై చేసి ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు.


మరణానంతరం క్లెయిమ్స్

ఒక వ్యక్తి మృతి చెందినప్పుడు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కానీ, EPFO 3.0లో ఈ క్లెయిమ్స్ ప్రాసెస్‌ విధానాన్ని చాలా ఈజీగా మార్చారు. మైనర్ల కోసం గార్డియన్‌షిప్ సర్టిఫికెట్ అవసరం లేదు. అవసరమైన డాక్యుమెంట్స్‌ మాత్రమే ఉంటే చాలు. క్లెయిమ్ త్వరగా సెటిల్ అయిపోతుంది. ఇది వారి కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. EPFO 3.0లో కొత్తగా డిజైన్ చేసిన మొబైల్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ PF స్టేటస్, కాంట్రిబ్యూషన్స్, క్లెయిమ్స్‌ ట్రాక్ చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2025 | 04:21 PM