New Rules From September 1st: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
ABN , Publish Date - Aug 28 , 2025 | 03:33 PM
ప్రతి నెలా ప్రారంభంలో కొత్త ఆర్థిక మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కీలకమైన ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పన్నుల దాకా, పెన్షన్ స్కీమ్స్ నుంచి ఇంధన ధరల వరకూ పలు రంగాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
బిజినెస్ డెస్క్: ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతి నెలా మొదటి తేదీ నుంచి కొన్ని కొత్త మార్పులు అమల్లోకి వస్తుంటాయి. అదే విధంగా ఈసారి సెప్టెంబర్ 1, 2025 నుంచి కొన్ని రూల్స్ మారబోతున్నాయి (New Rules From September 1st). ఇది పన్నులు, బ్యాంకింగ్, గ్యాస్, వెండి ధరలు ఇలా అనేక విషయాలను ప్రభావితం చేస్తుంది. అందులోనూ రోజువారీ జీవితంలో ప్రత్యక్షంగా ప్రభావం చూపే మార్పులే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ మార్పులు ఏంటి? సామాన్యుడికి ఏం లాభం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
GSTలో మార్పులు
GST అంటే గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్. ఇది మనం ప్రతి రోజూ చేసే కొనుగోళ్లపై ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో GST కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో జరుగనుంది. నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబ్స్‌ను తగ్గించి, కేవలం 5%, 12% రెండు శ్లాబ్స్ మాత్రమే ఉంచే అవకాశముంది. దీని వల్ల రోజువారీగా ఉపయోగించే వస్తువులపై పన్ను తక్కువ అవుతుంది.
వెండిపై హాల్ మార్కింగ్ తప్పనిసరి అవుతుందా?
సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలపైనా హాల్‌మార్క్ విధానం అమలులోకి వచ్చే అవకాశముంది. ఇప్పటివరకు ఇది బంగారానికి మాత్రమే ఉంది. ఇకపై వెండికీ ఉండే ఛాన్సుంది. ఈ మార్పు వెండి ధరలను స్వల్పంగా ప్రభావితం చేయవచ్చు, కానీ పారదర్శకత మాత్రం పెరుగుతుంది.
LPG సిలిండర్ ధర మారుతుంది
ప్రతి నెలా మొదటి తేదీ అంటే గ్యాస్ ధరల సమీక్ష రోజు. సెప్టెంబర్ 1న కూడా అదే జరుగుతుంది. గృహ ఉపయోగ LPG, వాణిజ్య ఉపయోగ LPGలలో ఈ రెండింటి ధరలను రివైజ్ చేస్తారు. పెరిగితే సామాన్యుల వంటగది బడ్జెట్ పెరుగుతుంది.
SBI క్రెడిట్ కార్డుకు కొత్త రూల్స్
మీ దగ్గర SBI లైఫ్స్‌స్టైల్ హోమ్ సెంటర్ క్రెడిట్ కార్డ్ లేదా దాని సెలెక్ట్ వెర్షన్ ఉందా?. అయితే ఈ మార్పులు మీరు తప్పక తెలుసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ గేమింగ్, సర్కార్ పోర్టల్‌లపై చెల్లింపులకి రివార్డ్ పాయింట్లు ఉండవు. బిల్లుల చెల్లింపులు, ఇంధనం కొనుగోలు, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటిపై ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఆటో-డెబిట్ విఫలమైతే అంతర్జాతీయ లావాదేవీలపై 2% జరిమానా + అదనపు రుసుములు వర్తించవచ్చు. ఈ మార్పులను బట్టి ఖర్చులు, పేమెంట్లను ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.
పీఎం జన్ ధన్ ఖాతాదారులకు KYC తప్పనిసరి
మీరు ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ఉపయోగిస్తున్నారా?. అయితే సెప్టెంబర్ 30 లోపు మీ KYC పూర్తి చేయాలని RBI స్పష్టం చేసింది. బ్యాంకులు ఇప్పటికే పంచాయతీ స్థాయిలో క్యాంపులు నిర్వహిస్తున్నాయి. వ్యక్తిగత, చిరునామా డేటా అప్డేట్ చేసుకోవాలి. మీ అకౌంట్ బ్లాక్ అవకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం.
ITR దాఖలు కూడా..
2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025గా ఉంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి