Recharge Plan: చౌక రీఛార్జ్ ప్లాన్.. రూ. 108కే 60 రోజుల ప్రయోజనం
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:09 PM
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారులకు అద్భుతమైన చౌక ప్లాన్లను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే 108 రూపాయలకు 60 రోజుల పాటు అందించే ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ప్రస్తుతం BSNL (భారత ప్రభుత్వ టెలికాం సంస్థ) ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటివల మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఈ సంస్థ లాభాల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే వినియోగదారులకు తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఈ టెలికాం సంస్థ నిరంతరం వినియోగదారుల అవసరాల మేరకు ప్రత్యేకమైన సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా BSNL తన సేవలను విస్తరించి, విశ్వసనీయమైన నెట్‌వర్క్ కనెక్షన్లు అందిస్తోంది.
60 రోజుల ప్రయోజనం..
ప్రస్తుతం BSNL ఇటివల లాంచ్ చేసిన 108 రూపాయల రీఛార్జ్ ప్లాన్ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్లాన్ వినియోగదారులకు 60 రోజుల పాటు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. 108 రూపాయల ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 1GB డేటాను పొందుతారు. ఇది 60 రోజుల పాటు లభిస్తుంది. అంటే మొత్తం 60GB డేటా వస్తుంది. ఇది ఇంటర్నెట్ సేవలను తరచుగా ఉపయోగించే వారికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
అపరిమిత కాల్స్‌తోపాటు..
మీరు ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందుతారు. అంటే మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంత కాలం మాట్లాడినా అదనంగా ఛార్జీలు ఉండవు. దీంతోపాటు మీరు 500 SMSలను కూడా పొందవచ్చు. ఇవి 60 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. మీరు 1GB డేటా పూర్తి చేశాక కూడా మీరు ఎలాంటి అధిక ఛార్జీలు ఉండవు. ఈ ప్లాన్‌లో డేటా ఛార్జీలు ప్రతి MBకి మీకు సగటున రూ. 0.25 మాత్రమే పడుతాయి.
ఇతర కంపెనీలతో పోల్చితే
గ్రామీణ ప్రాంతాల్లో BSNL నెట్ వర్క్ విస్తరణ ఎక్కువ, కాబట్టి ఈ ప్లాన్ గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చితే ఈ ప్లాన్ చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఇతర కంపెనీలు ఈ ధరల్లో ఒక్క ప్లాన్ కూడా అమలు చేయడం లేదు. దీంతో అనేక మంది యూజర్లు ఈ ప్లాన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మీకు మరిన్ని ప్లాన్స్ గురించి వివరాలు తెలియాలంటే మాత్రం బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ (https://www.bsnl.co.in/) సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Unified Pension Scheme: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం అమలు..
Edible Oil: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
PM Modi: విదేశీ పర్యటన తర్వాత.. ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
Read More Business News and Latest Telugu News