BIG BREAKING: జన్‌ధన్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్
ABN , Publish Date - Oct 03 , 2025 | 03:51 PM
దేశంలో జన్‌ధన్ ఖాతాదారులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపుగా ప్రతి బ్యాంకులో ఈ ఖాతాదారులు ఉన్నారు. ఈ ఖాతాదారులకు తాజాగా ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 03: జన్‌ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్లు పొందిన ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియ కీలక సూచన చేసింది. ఈ ఖాతాలకు రీ కేవైసీ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ రీకేవైసీకి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పంచాయతీ స్థాయిలో రీ కేవైసీ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు.. వాటిని వినియోగించుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఈ క్యాంపుల్లో రీ కేవసీతోపాటు మైక్రో ఇన్సూరన్స్, పెన్షన్ పథకాలపై సైతం దృష్టి సారించినట్లు వెల్లడించింది. ఇంతకీ రీకేవైసీ అంటే ఏమిటంటే..
రీ కేవైసీ అనేది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, చిరునామా తదితర అంశాలను అప్ డేట్ చేసే ప్రక్రియ. మీ కేవేసీ గడువు తేదీ ముగిసినా లేదా మీకు సంబంధించిన వివరాలు మారినా.. నిబంధనల ప్రకారం బ్యాంక్‌కు తాజా సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ జన్‌ధన్ ఖాతాలు తెరిచి 10 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ రీకేవైసీ ప్రక్రియన చేపడుతున్నారు. ఈ సదుపాయాన్ని ఆయా క్యాంపుల్లో వినియోగించుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లోనూ రీకేవైసీని పూర్తి చేసే సౌకర్యాన్ని ఆర్‌బీఐ కల్పించింది.
అత్యధిక ఖాతాలు.. ఆ బ్యాంకులోనే..
అయితే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో జన్‌ధన్ ఖాతాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. మీ జన్‌ధన్ ఖాతా ఈ బ్యాంకు శాఖలో ఉన్నట్లు అయితే.. ఆన్‌లైన్‌లోనూ రీ కేవైసీ చేసుకునే వెసులుబాటును కల్పించింది. అందుకోసం ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంది.
ఇంతకీ జన్‌ధన్ ఖాతాలు అంటే ఏమిటీ?
2014లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో నిరుపేద భారతీయులకు సైతం బ్యాంకు ఖాతా సౌకర్యం కల్పించాలనే ఉదేశ్యంతో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దేశంలో ప్రతి కుటుంబానికి ఒక్క బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ ఖాతాల ద్వారా ప్రజలు భద్రంగా తమ నగదును పొదుపు చేసుకోవడం, బ్యాంకు రుణాలు పొందడం సులభతరం చేసింది. ఈ ఖాతాల్లో పైసా నగదు లేకుండా నిర్వహించుకునే వెసులుబాటును సైతం కల్పించింది. ఇటీవల ఈ ఖాతాలు ఉన్న ఖాతాదారులకు చెక్కు సౌకర్యాన్ని సైతం కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అలయ్ బలయ్ సంప్రదాయం కాదు.. తెలంగాణ ఆత్మ: బండారు దత్తాత్రేయ
పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య
Read Latest National News And Telugu News