Apple Hebbal Bengaluru: దేశంలో యాపిల్ ఐఫోన్ థర్డ్ స్టోర్..ఈసారి సౌత్‌లో
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:32 PM
సౌత్ ఇండియాలో యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త వచ్చింది. ఇప్పటికే ముంబై, ఢిల్లీలో స్టోర్ల తర్వాత, యాపిల్ ఇప్పుడు మూడో అధికారిక స్టోర్‌ను సెప్టెంబర్ 2న బెంగళూరులో లాంచ్ చేయనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
టెక్ లవర్స్‌కి, యాపిల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. యాపిల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో తన మొదటి స్టోర్‌ని ఓపెన్ చేయనుంది. బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏసియాలో యాపిల్ హెబ్బల్ స్టోర్ సెప్టెంబర్ 2, 2025న మధ్యాహ్నం 1 గంటలకు ఓపెన్ చేయనుంది. ఇది భారతదేశంలో యాపిల్‌కి మూడో ఆఫీషియల్ స్టోర్. ముంబైలోని యాపిల్ BKC, ఢిల్లీలోని యాపిల్ సాకేత్ తర్వాత ఇప్పుడు సౌత్ ఇండియాలోని బెంగళూరుకు వచ్చింది. త్వరలో పూణేలో యాపిల్ కోరెగావ్ పార్క్ ప్రాంతంలో నాలుగో స్టోర్ ఓపెన్ కానుంది.
స్టోర్ ఎక్కడుంది? ఎలా వెళ్లాలి?
యాపిల్ హెబ్బల్ స్టోర్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏసియాలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. మీరు మాల్ లోపలికి వెళ్లిన తర్వాత కుడి వైపు ఎస్కలేటర్ కనిపిస్తుంది. దాన్ని ఎక్కి ఫస్ట్ ఫ్లోర్‌కి వెళితే మీకు యాపిల్ హెబ్బల్ స్టోర్ కనిపిస్తుంది. ఈ స్టోర్ కేవలం షాపింగ్ స్పాట్ మాత్రమే కాదు. ఇదొక కమ్యూనిటీ హబ్. బెంగళూరు ఇన్నోవేషన్ స్పిరిట్‌ని సెలబ్రేట్ చేసే వేదికగా యాపిల్ దీన్ని రూపొందించింది.
ఈ స్టోర్ స్పెషల్ ఏంటో ఇక్కడ చూద్దాం
70 మంది టీమ్ మెంబర్స్: ఈ స్టోర్‌లో 15 రాష్ట్రాల నుంచి వచ్చిన 70 మంది టీమ్ మెంబర్స్ మీకు బెస్ట్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ఏ ప్రొడక్ట్ గురించి అడిగినా, సరైన సలహాలు, సపోర్ట్ అందిస్తారు.
100% రిన్యూవబుల్ ఎనర్జీ: యాపిల్ హెబ్బల్ స్టోర్ పూర్తిగా రిన్యూవబుల్ ఎనర్జీతో నడుస్తుంది. ఇది ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ స్టోర్
టుడే అట్ యాపిల్ సెషన్స్: రోజూ ఫ్రీగా నిర్వహించే టుడే అట్ యాపిల్ సెషన్స్‌లో మీరు యాపిల్ ప్రొడక్ట్స్ గురించి మరింత నేర్చుకోవచ్చు. ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, కోడింగ్ లాంటి టాపిక్స్‌పై ఈ సెషన్స్ ఉంటాయి.
బిజినెస్ సపోర్ట్: స్మాల్ బిజినెస్ ఓనర్స్ కోసం బిజినెస్ ప్రోస్ టీమ్ రెడీగా ఉంది. డివైస్ సపోర్ట్, టూల్స్, గైడెన్స్‌తో మీ బిజినెస్‌ని బూస్ట్ చేసుకోవచ్చు.
ప్రొడక్ట్స్ రేంజ్: ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15, యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్, మ్యాక్‌లు, ఐప్యాడ్‌లు, యాపిల్ పెన్సిల్, హోమ్‌పాడ్ లాంటి యాపిల్ డివైస్‌లు, యాక్సెసరీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్‌లో లాంచ్ అయ్యే ఐఫోన్ 17 సిరీస్‌ని కూడా ఇక్కడ పొందవచ్చు.
యాపిల్ జీనియస్ బార్: ఏదైనా యాపిల్ ప్రొడక్ట్ గురించి డౌట్స్ ఉంటే, జీనియస్ బార్‌లో ఎక్స్‌పర్ట్స్ మీకు సహాయం చేస్తారు.
ఆన్‌లైన్ ఆర్డర్ పికప్: యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఆర్డర్ చేసి, స్టోర్‌లోని డెడికేటెడ్ పికప్ ఏరియాలో మీ ఆర్డర్‌ని కలెక్ట్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి