Share News

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:39 PM

7th Pay Commission: ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద హోలీకి ముందే కానుక లభించే అవకాశం ఉంది. మార్చి 14న జరిగే పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌పై కీలక ప్రకటన..

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..
Latest Update on 7th Pay Commission

7th Pay Commission DA Hike Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం హోలీ కానుకగా అదిరిపోయే న్యూస్ చెప్పింది. మార్చి 14న జరిగే హోలీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపుపై కీలక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, రేపు బుధవారం, మార్చి 12న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి ఆమోదం లభిస్తే 1.2 కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.


అమల్లోకి వచ్చేదెప్పుడు..

కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు డీఏ, డీఆర్ పెంపుదలలను ప్రకటిస్తుంది. ఒకటి మార్చిలో, మరొకటి అక్టోబర్‌లో. మార్చిలో హోలీ సమయంలో ప్రకటించిన పెంపు జనవరిలో నుంచి.. అక్టోబర్ దీపావళి సమయంలో ప్రకటించిన పెంపు జూలై నుంచి అమల్లోకి వస్తుంది. అయితే మార్చి 5,2025న న్యూఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై ఎటువంటి చర్చా జరగలేదు. చివరిసారిగా డీఏని జూలై 2024 లో 50% నుండి 53% కి పెంచారు. అంతకుముందు మార్చి 7, 2024న DAని 46% నుంచి 50%కి పెంచుతూ కేబినెట్ ఆమోదించింది. ఈ విషయాన్ని హోలీకి కొన్ని రోజుల ముందు మార్చి 25, 2024న అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కొత్తగా పెంపుపై ముందుకు వెళితే సవరించిన డీఏ, డీఆర్ రేట్లు జనవరి 2025 నుండి వర్తిస్తాయి.


డీఏ ఎంత శాతం పెరుగుతుంది..

డిసెంబర్ 2024 నాటి AICPI-IW డేటా ప్రకారం ఈసారి DA 2% పెరుగుతుందని అంచనా. 7వ వేతన సంఘం ప్రకారం ప్రభుత్వం అక్టోబర్ 16, 2024న DA, DR లను 3% పెంచింది. జూలై 1, 2024 నుండి రెండూ 53%కి పెరిగాయి. ఇప్పుడు అందరి కళ్ళు తదుపరి పెరుగుదలపైనే ఉన్నాయి. జనవరి 2025లో ప్రభుత్వం 8వ వేతన సంఘం కోసం ప్రణాళికలను ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది నాటికి అమలు చేయబడుతుందని భావిస్తున్నారు. అప్పటి నుండి ఉద్యోగులు, పెన్షనర్లు వేతనాలు,పెన్షన్లలో గణనీయమైన సవరణ జరుగుతుందని ఆశిస్తున్నారు.


Read Also : Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు

ఎస్‌ఎంఈ ఐపీఓ నిబంధనలు కఠినతరం

Updated Date - Mar 11 , 2025 | 04:50 PM