BC Communities : బీసీలపై వైసీపీ కత్తి!
ABN , Publish Date - Feb 05 , 2025 | 03:15 AM
ల్లు గీత కార్మికుల ఆర్థిక అభ్యున్నతికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్ల వరద
పిటిషనర్లలో ఎక్కువ మంది వైసీపీ అనుకూలురే!
మాజీ ప్రభుత్వ న్యాయవాదులతో వేయించారంటున్న టీడీపీ
మాజీ స్టాండింగ్ కౌన్సిళ్లు కూడా
జగన్ స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 24 శాతానికి తగ్గించారంటున్న నేతలు
ఆయన మద్యం పాలసీతో 4 వేల కల్లుదుకాణాలు మూతపడ్డాయని వెల్లడి
బీసీలపై వైసీపీ ద్వేషానికి ఇవే నిదర్శనమంటూ ధ్వజం
అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): బలహీన వర్గాలంటే తమకు గిట్టదని వైసీపీ నాయకులు మరోసారి నిరూపించుకుంటున్నారు. కల్లు గీత కార్మికుల ఆర్థిక అభ్యున్నతికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. 2014-19 మధ్య రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పిటిషన్ల అస్త్రాన్ని ప్రయోగించిన వైసీపీ పెద్దలు తాజాగా మరోసారి అదే బాటలో పయనిస్తున్నారు. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10 శాతం (340 దుకాణాలు) రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీవో 13 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, యాత వంటి బీసీ కులాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. బీసీల పక్షపాతిగా కూటమి ప్రభుత్వానికి పేరు రావడం ఓర్వలేని వైసీపీ పెద్దలు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో సుమారు 35 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో అధికశాతం వైసీపీ నేతలు, వారి అనుకూల న్యాయవాదులు వేసినవి కాగా.. మిగిలినవి వారి సానుభూతిపరులతో వేయించినవని టీడీపీ నాయకులు ఆధారాలు చూపి మరీ ఆరోపిస్తున్నారు. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో వైసీపీ హయాంలో ప్రభుత్వ న్యాయవాదులుగా, స్టాండింగ్ కౌన్సిల్స్‌గా పనిచేసినవారు ఉండడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
బీసీలు ఆర్థికంగా ఎదగకూడదనే దురుద్దేశంతో తాడేపల్లి పెద్దలు తమ అనుకూల న్యాయవాదులతో ఆడిస్తున్న డ్రామాగా దీనిని టీడీపీ భావిస్తోంది. వైసీపీ తొలి నుంచీ బీసీల పట్ల ద్వేషంతోనే వ్యవహరిస్తోందని బీసీ నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల పార్టీగా గుర్తింపు పొందింది. ఎన్టీఆర్ తొలిసారి వారికి స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించారు. చంద్రబాబు హయాంలో 34 శాతానికి పెంచారు. జగన్ అధికారంలోకి రాగానే 24 శాతానికి కుదించారు. ఈ నిర్ణయంతో 16వేల పైచిలుకు మంది బీసీలు స్థానిక సంస్థల్లో అధికారానికి దూరమయ్యారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన మద్యం పాలసీ కారణంగా 4 వేల కల్లు దుకాణాల వరకు మూతపడ్డాయి. ఇవన్నీ బీసీల పట్ల వైసీపీ ద్వేషానికి నిదర్శనాలని బీసీ నేతలంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News