Share News

YS Sharmila: కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుంది

ABN , Publish Date - Feb 01 , 2025 | 09:47 PM

YS Sharmila: కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. మోడీ గారి భారత్ బడ్జెట్‌(బీహార్ ఎన్నికల)లో ఏపీకి కేటాయింపులు .. ‘కొండంత రాగం తీసి కూసంత పాట’ పాడినట్లుందని వ్యంగ్యంగా పేర్కొ్న్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలున్న సీఎం నితీష్ కుమార్.. బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే.. 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు గారికి మాత్రం మోదీ చిప్ప చేతిలో పెట్టారని మండిపడ్డారు.

YS Sharmila: కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుంది
AP PCC Chief YS Sharmila

విజయవాడ, ఫిబ్రవరి 01: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ బిహార్‌కి ఫుల్, ఏపీకి నిల్ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇది భారత్ బడ్జెట్ కాదు.. బిహార్ ఎన్నికల బడ్జెట్ అని ఆమె అభివర్ణించారు. శనివారం విజయవాడలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. మోడీ గారి భారత్ బడ్జెట్‌(బీహార్ ఎన్నికల)లో ఏపీకి కేటాయింపులు .. ‘కొండంత రాగం తీసి కూసంత పాట’ పాడినట్లుందని వ్యంగ్యంగా పేర్కొ్న్నారు.

ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలున్న సీఎం నితీష్ కుమార్.. బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే.. 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు గారికి మాత్రం మోదీ చిప్ప చేతిలో పెట్టారని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో బిహార్‌ను అందలం ఎక్కించి.. ఆంధ్రకు గుండు సున్నా ఇచ్చారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారంటూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Also Read: దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా.. అంటూ సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

Also Read: షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ


ఏపీ ప్రజల మద్దతుతో గద్దెనెక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. బడ్జెట్‌లో ఈ సారి కూడా హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతికి గతంలో ఇచ్చిన రుణం తప్పా.. ప్రస్తుతం ఒక్క రూపాయి సహాయం లేదన్నారు. పోలవరం అంచనాలకు ఆమోదం అన్నారే.. కానీ బడ్జెట్‌లో ఆశించిన ఫలితం లేదని చెప్పారు.

Also Read: ఇది సీఎం చంద్రబాబు పవర్..

Also Read: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?


విభజన హామీలను తుంగలో తొక్కారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక పరిశ్రమలు సైతం కేటాయించ లేదని చెప్పారు. మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టించుకోలేదు.. కడప స్టీల్ ఊసే లేదంటూ కేంద్ర బడ్జెట్‌పై వైఎస్ షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ

Also Read: మళ్లీ ఎన్‌కౌంటర్: భారీగా మావోయిస్టులు హతం


రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప.. ఆంధ్రప్రదేశ్‌కు ఉపయోగపడే ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించ లేదన్నారు. అవసరం ఉన్నంత సేపు ఓడ మల్లన్న... గట్టెక్కాక బోడి మల్లన్న.. రాష్ట్ర ప్రజలను మోడీ గారు బోడి మల్లన్న కింద లెక్క గట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న ఉదాసీనత ఈ బడ్జెట్‌తో తేటతెల్లమైందన్నారు. ఇంత అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ బడ్జెట్‌ను ప్రగతిశీల బడ్జెట్ అని స్వాగతించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 09:47 PM