Share News

Tirupati: వైసీపీ జెండాలతో తిరుమలకు పాదయాత్ర

ABN , Publish Date - Aug 20 , 2025 | 10:06 AM

లిక్కర్‌ కేసులో నిందితుడు ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోగ్యం బాగుండాలని తిరుమలకు పాదయాత్రగా వస్తున్న వైసీపీ కార్యకర్తలనుచంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Tirupati: వైసీపీ జెండాలతో తిరుమలకు పాదయాత్ర

- అడ్డుకుని 10మందికి పోలీసుల అనుమతి

చంద్రగిరి(తిరుపతి): లిక్కర్‌ కేసులో నిందితుడు ఎంపీ మిథున్‌రెడ్డి(MP Mithun Reddy) ఆరోగ్యం బాగుండాలని తిరుమలకు పాదయాత్రగా వస్తున్న వైసీపీ(YCP) కార్యకర్తలనుచంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శనివారం వైసీపీ విద్యార్థి సంఘం నాయకుడు హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 30 మంది పీలేరు నుంచి పార్టీ జెండాలతో తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసమంగాపురానకి చేరుకున్నారు.


nani1.2.jpg

పార్టీ జెండాలతో శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళకూడదని డీఎస్పీ ప్రసాద్‌, సీఐ ఇమ్రాన్‌బాషా తెలిపారు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీవారి మెట్టు మార్గంలో ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని 10 మందిని అనుమతిస్తామని చెప్పడంతో వారు అంగీకరించారు. అయితే 10 మంది కాకుండా పోలీసుల కళ్లు గప్పి మరో ఆరుగురు వెళ్ళారు. దీంతో టీటీడీ సెక్యూరిటీ, పోలీసులు అప్రమత్తమై ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకుని చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 10:06 AM