Share News

Dal Mill Suri: వైసీపీ నేత దాల్‌మిల్ సూరి అరెస్ట్

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:33 PM

వైసీపీ నేత దాల్ మిల్ సూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఏపీ, తమిళనాడు, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో 57 ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. దాల్ మిల్ సూరి డొల్ల కంపెనీలతో రైతులకు కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Dal Mill Suri: వైసీపీ నేత దాల్‌మిల్ సూరి అరెస్ట్
Dal Mill Suri Arrest

శ్రీ సత్యసాయి జిల్లా, అక్టోబర్ 22: వైసీపీ నేత దాల్ మిల్ సూరి(YCP Leader Dal Mill Suri)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 57 ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. దాల్ మిల్ సూరి డొల్ల కంపెనీలతో రైతులను కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు బాధితులు కూడా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాల్ మిల్ సూరిపై ఇప్పటికే పీడియాక్ట్(PD Act) నమోదు చేశారు.


సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ..'డొల్ల కంపెనీలతో రైతులను మోసం చేసి పోలీస్ కళ్లు కప్పి తిరుగుతున్న దాల్ మిల్ సూరిని అరెస్ట్ చేశాము. అతని తమ్ముడు పాండు, కుటుంబసభ్యులతో కలిసి రైతులు, వ్యాపారస్తులను మోసగించి(Fraudulent Business Practices) రూ.300 కోట్ల సంపాదించారు. కుటుంబసభ్యుల పేర్లతో, అతని బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను జప్తు చేస్తాం.

ఎవరైనా రైతులను మోసగించి పదే పదే ఇటువంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు' అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే సూరి(Dal Mill Suri)పై కొత్తచెరువు పీఎస్ లో 20 కేసులు, నెల్లూరు రూరల్ పీఎస్ లో 16 కేసులు నమోదయ్యాయి. అలానే లుకౌట్ నోటీసులు కూడా సూరీపై జారీ అయ్యాయి. ఎట్టకేలకు శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు దాల్ మిల్ సూరిని అరెస్ట్ చేశారు.



ఇవి కూడా చదవండి..

అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 07:51 PM