Share News

King Cobra: బాత్‌రూమ్‌లో కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ..

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:11 PM

తాజాగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో భారీ కింగ్ కోబ్రా స్థానికులను హడలెత్తించింది. కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఓ ఇంటి బాత్రూంలోకి చొరబడి మాటువేసింది.

King Cobra: బాత్‌రూమ్‌లో కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ..
King Cobra

పార్వతీపురం మన్యం: వర్షాకాలం మొదలైదంటే చాలు.. కీటకాలు, పురుగులు, పాములు బయటకొస్తుంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పాముల బెడద చెప్పనలవిగాదు. అక్కడి జనాలు నిత్యం భయం భయంతో ఉంటారు. వర్షాకాలంలో.. వరదలు రావడం ఎలా కామనో.. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో ప్రాణాంతకమైన కీటకాలు, పురుగులు, పాములు కామన్. చిన్న చిన్న కీటకాలు, పురుగులు వల్ల మనకు పెద్దగా ప్రమాదం ఏం లేకపోయిన జాగ్రత్తగా ఉండటం బెటర్.. అయితే పాముల విషయానికి వస్తే.. చాల మంది వాటిని చూస్తేనే.. పరుగులు తీస్తుంటారు. కర్రలు పట్టుకొని వాటి ప్రాణం తీసేవారకు నిద్రపోరు. అవి అంత ప్రమాదకరం మరి. పాముల్లోనూ.. మంచి పాములు లేవా అంటే ఉన్నాయండోయ్.. వాటి వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేకపోయిన మన ప్రాణ భయంతో వాటి ప్రాణం తీస్తుంటాము. అది వేరే విషయం..


ఇప్పుడు ఈ విషయాలు ఎందుకంటారా.. తాజాగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో భారీ కింగ్ కోబ్రా స్థానికులను హడలెత్తించింది. కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఓ ఇంటి బాత్రూంలోకి చొరబడి మాటువేసింది. స్నానం కోసం వెళ్లిన వ్యక్తికి పామును చూసి గుండె ఆగినంత పనైంది. ఆ పామును చూసి పెద్దగా కేకలు వేశారు. దీంతో గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే బుసలు కొడుతున్న భారీ గిరినాగును చూసి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పామును చూస్తే.. కర్రలతో వెంటపడే జనాలు.. ఆ పామును చూసి కాలు కూడా కదపలేకపోయారు. అంతపెద్ద పామును చూసి కొంతమంది పారిపోయారు కూడా.. అయితే షాక్ నుంచి కోలుకున్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు విశాఖ నుండి స్నేక్ క్యాచర్స్‌ని రప్పించారు. ఆ స్నేక్ క్యాచర్స్‌ని కూడా కింగ్‌కోబ్రా ముప్పుతిప్పులు పెట్టింది. ఏదైతేనేం చివరికి వారి నైపుణ్యంతో అతి కష్టం మీద కోబ్రాను బంధించారు. ఆ కింగ్ కోబ్రాను మన్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు

ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు

Updated Date - Aug 12 , 2025 | 04:34 PM