Students fight: రౌడీల్లా కొట్టుకున్న సీరియర్‌లు, జూనియర్లు.. ఎక్కడంటే
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:57 PM
Visakhapatnam: విశాఖలో కాలేజ్ స్టూడెంట్ ఒకరినొకరు కొట్టుకోవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. సీనియర్, జూనియర్ విద్యార్థులు వీధి రౌడీల్లా మారి పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. చిన్నపాటి వివాదమే పెను ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం, ఫిబ్రవరి 17: విశాఖలోని (Visakhapatnam) దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో (Duvvada Vigyan College) విద్యార్థులు రెచ్చిపోయారు. వీధి రౌడీలుగా మారి ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు విద్యార్థులు. సీనియర్లు, జూనియర్లు రౌడీల్లా కొట్టుకున్నారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలేజ్‌లో విద్యార్థులు కొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం కాలేజ్‌లో విద్యార్థులకు ఫెస్ట్ జరిగింది. ఫెస్ట్‌లో భాగంగా డ్యాన్స్ నిర్వహించారు.
అయితే డ్యాన్స్ చూస్తున్న క్రమంలో ఒకరి కాలు మరొకరికి తగలడంతో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. సీనియర్ స్టూడెంట్‌కు, జూనియర్ స్టూడెంట్‌కు మధ్య కాలు తగలడంతో అక్కడ ఘర్షణ చెలరేగింది. అంతటితో గొడవకు పుల్‌స్టాప్ పడకపోగా రాత్రంతా కూడా కొనసాగింది. అంతేకాకుండా మరుసటి రోజు వీరంతా కాలేజ్ ఎదుట కర్రలతో దాడులు చేసుకున్నారు. కావాలని కాలితో తన్నాడని ఓ వర్గం వారు చెబుతుంటే.. పొరపాటున తగిలిందని మరో వర్గం చెబుతోంది. ఈ క్రమంలో సీనియర్, జూనియర్ విద్యార్థులు తామంతా ఒకే కాలేజ్ అన్న విషయాన్ని మరచి వీధి రౌడీల్లాగా రోడ్డు మీద కొట్టుకున్నారు.
విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకుంటున్న దృశ్యాలు భయానక వాతావరణాన్ని సృష్టించేలా ఉన్నాయి. ఈ వీడియోలు చూసి తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దువ్వాడ విజ్ఞాన్ కాలేజ్‌లో జరిగిన ఘర్షణపై సీనియర్‌లు, జూనియర్‌లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో జరిగిన వివాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ దాడుల్లో గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు
Read Latest AP News And Telugu News