చిత్తూరులో దారుణ ఘటన
ABN, Publish Date - Feb 17 , 2025 | 02:29 PM
Chittoor: పెళ్లికాకుండానే పదో తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణం ఎవరు అనేది అంతుపట్టని ప్రశ్నగా మారింది. బిడ్డను జన్మనిచ్చిన సదరు విద్యార్థిని మాత్రం...
చిత్తూరు, ఫిబ్రవరి 17: జిల్లాలోని పలమనేరు రూరల్‌లో దారణం వెలుగుచూసింది. పెళ్లి కాకుండానే పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విద్యార్థిని గర్భం దాల్చడానికి కారకులు ఎవరు అనేదానిపై ఆరా తీస్తున్నారు. టీ ఒడ్డు గ్రామానికి చెందిన సునీత అలియాస్ బేబీ పెంగరగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. బేబీకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బంగారు పాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు.
చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విద్యార్థిని గర్భం దాల్చిందని వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చిన బేబీ. ఆపై కోమాలోకి వెళ్లిన విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బేబీ గర్భం ఎలా దాల్చించి... దానికి కారకులు ఎవరూ అనేది కుటుంబసభ్యులకు కూడా అంతుపట్టని పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు
Read Latest AP News And Telugu News
Updated at - Feb 17 , 2025 | 02:29 PM