Rains Alert In Andhrapradesh: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు..
ABN , Publish Date - Sep 30 , 2025 | 02:54 PM
బంగాళాఖాతం అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
విశాఖపట్నం, సెప్టెంబర్ 30: ఉత్తర కోస్తా బంగాళాఖాతం అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణం కేంద్రం మంగళవారం వెల్లడించింది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మంగళవారం అంటే.. ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని.. అది రేపు అంటే.. అక్టోబర్ 1వ తేదీ నాటికి మధ్య బంగాళఖాతంలో అల్పపీడనంగా మారుతుందని స్పష్టం చేసింది.
అలాగే 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి.. అది వాయుగుండంగా మారుతుందని చెప్పింది. ఇది 3వ తేదీ నాటి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే ఆవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానాం, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో రానున్న 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు.. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ అప్రమత్తమైంది. అందులోభాగంగా జిల్లా కలెక్టర్లకు కీలక సూచన చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దారుణం.. మైనర్ బాలికపై బాబాయి అత్యాచారం..
కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
For AP News And Telugu News