Share News

Raging: సెవెంత్ స్టూడెంట్‌పై టెన్త్ స్టూడెంట్స్ ఎంత దారుణానికి పాల్పడ్డారంటే

ABN , Publish Date - Feb 18 , 2025 | 03:50 PM

Raging: స్కూల్ హాస్టల్‌లో ర్యాగింగ్ తీవ్ర సంచలనం రేపుతోంది. ఏడో తరగతి విద్యార్థినిపై ముగ్గురు పదో తరగతి విద్యార్థులు దాడి చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు.

Raging: సెవెంత్ స్టూడెంట్‌పై టెన్త్ స్టూడెంట్స్ ఎంత దారుణానికి పాల్పడ్డారంటే
School Raging

అల్లూరు జిల్లా, ఫిబ్రవరి 18: జిల్లాలోని పాడేరులో ర్యాగింగ్ కలకలం రేపింది. సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్‌లో ఏడవ తరగతి బాలికపై పదవ తరగతి విద్యార్థినిలు దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ముగ్గురు విద్యార్థినిలను యాజమాన్యం హాస్టల్‌ నుంచి తొలగించింది. విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ విచారణ చేపట్టింది. దాదాపు 15 రోజుల క్రితం హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక ఏడో తరగతి విద్యార్థినిని ముగ్గురు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు కొట్టినట్లు వీడియోలో ఉంది.


విషయం తెలిసిన స్కూల్ యాజమాన్యం ఆ ముగ్గురిని కూడా హాస్టల్‌ నుంచి తొలగించింది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరావుతో డీఈవో అధికారులకు పంపించి ఈ ఘటనపై విచారణ చేయించారు. ర్యాగింగ్ ఎందుకు జరిగింది.. విద్యార్థినిపై ఎందుకు దాడి చేశారనే దానిపై విచారణ జరిపి డీఈవోకు రిపోర్టు అందజేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏడో తరగతి విద్యార్థినిపై దాడి చేసి ముగ్గురు విద్యార్థినులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ ఆదేశించినట్లు సమాచారం.

Manchu Manoj: నన్ను భయపెట్టలేరు.. మంచు మనోజ్ సంచలనం..


అయితే విద్యార్థినులు ఇలా చేయడానికి అసలు కారణం ఏంటి అనేది బయటకు రాలేదు. ఒక విద్యార్థిని మాట్లాడానికి పిలించి మాట్లాడుతూనే ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనను మరొకరు వీడియో తీశారు. ఈ నేపథ్యంలో అసలు విద్యార్థుల మధ్య ఏంజరిగింది అనే అంశాలపై విద్యాశాఖ విచారణ జరిపింది. విద్యార్థులతో పాటు విద్యార్థినులను కూడా విచారించి రిపోర్టును డీఈవోకు అందజేశారు. కాగా ఏజెన్సీ తరుచూ ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. జీ.మాడుగుల్లో ఇదే తరహాలో ఒక వివాదం చోటు చేసుకుంది. సరిగా చదవలేదనే కారణంతో విద్యార్థిని జుట్టును టీచర్ కట్ చేయడం వివాదాస్పదంగా మారింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే, అధికారులు, గిరిజన సంఘాలు కోరుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..

భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 18 , 2025 | 04:45 PM