Share News

Nara Lokesh: ఎవరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 27 , 2025 | 12:46 PM

రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్సార్‌సీపీ, బ్లూ మీడియా పత్రిక సాక్షి పై మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా తనపై సాక్షిలో కథనం రాశారని, దానిపై నోటీసులు ఇచ్చానని.. ఈ కేసుకు సంబంధించి సోమవారం విశాఖ కోర్టు వచ్చానని తెలిపారు. అయితే విచారణ వాయిదా పడిందని, దీనిపై ఎన్ని సంవత్సరాలైనా న్యాయపోరాటం చేస్తానని, ఎన్నిసార్లు కేసు వాయిదా పడినా.. కోర్టుకు వస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్‌పై తల్లి, చెల్లికే నమ్మకం లేదని.. ఇక నాయకులకేం ఉంటుందని అన్నారు.

Nara Lokesh: ఎవరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు..
Minister Nara Lokesh

విశాఖ: మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) విశాఖలో కోర్టుకు (Vishaka Court) వెళ్లారు. ‘సాక్షి’ (Sakshi) పరువు నష్టం కేసు (Defamation case)లో విచారణకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఆయన హాజరయ్యారు. కాగా సాక్షి తరఫున న్యాయవాది కోర్టుకు హాజరుకాకపోవడంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షి తనపై ఒక కథనం రాసిందని.. తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు రూ. 25 లక్షలు ఖర్చు చేసిందని వార్త రాసిందని.. దీనికి సంబంధించి అప్పుడు తాను ఆధారాలు చూపించాలంటూ సాక్షిపై లీగల్ నోటీసు జారీ చేశానని లోకేష్ తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి..

గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం


ఆధారాలు లేకుండా సాక్షిలో కథనం..

ఆధారాలు లేకుండా సాక్షిలో కథనం రాశారని, దీనిపై ఎన్ని సంవత్సరాలైనా న్యాయపోరాటం చేస్తానని, ఎన్నిసార్లు కేసు వాయిదా పడినా.. కోర్టుకు వస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్‌పై తల్లి, చెల్లికే నమ్మకం లేదు.. ఇక నాయకులకేం ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వ అవినీతి కేసులపై వెంటనే విచారణ జరపడం కుదరదని, ఒక్కొక్కటిగా అన్నీ చేస్తామని, వేచి చూడాలని అన్నారు. తప్పు చేసినవారిని ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

దావోస్ పర్యటనపై దుష్ప్రచారం..

దావోస్ పర్యటనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్‌ మండిపడ్డారు. సుస్థిర పాలన వల్లే మహారాష్ట్రకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని, వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ ప్రజలు చాలా నష్టపోయారని అన్నారు. జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అమర్‌రాజా బ్యాటరీ కంపెనీని గత ప్రభుత్వం వేధించిందని.. అందువల్లే ఆ కంపెనీ చెన్నైకు తరలిపోయిందన్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారో అందరికీ తెలుసునని, కియా, టీసీఎస్ క్రెడిట్‌ను వైఎస్ఆర్‌సీపీ వాళ్ల అకౌంట్‌లో వేసుకుందామని చూశారన్నారు. పారిశ్రామికవేత్తలను వేధిస్తే పెట్టుబడులకు ఎవరొస్తారని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పామని, అధికారంలోకి వచ్చాక చేసి చూపించామని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని లోకేష్ చెప్పారు.


డిప్యూటీ సీఎం పదవిపై స్పందన..

డిప్యూటీ సీఎం పదవిపై వచ్చిన వార్తలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యంకాదని, తాను కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని అన్నారు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేది తన అభిప్రాయమని అన్నారు. మూడు పర్యాయాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని.. ఈసారి ఆ పదవిలో ఉండకూడదనుకుంటున్నానని మంత్రి లోకేష్ వెల్లడించారు.


కాగా రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధిశాఖామంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి విశాఖ నగరానికి చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు రాత్రి చేరుకున్న లోకేశ్‌కు మంత్రి కొండపల్లిశ్రీనివాస్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ గణబాబు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, సుందరపు విజయకుమార్‌, లోకం మాధవి, విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ, కార్పొరేషన్‌ చైర్మన్లు పీలా గోవింద్‌, బత్తుల తాతయ్యబాబుతోపాటు నేతలు బుద్దా నాగజగదీష్‌, మహ్మద్‌ నజీర్‌, పెల ప్రసాద్‌, చింతకాయల విజయ్‌, గంటా రవితేజ, బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు స్వాగతం పలికారు.

ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న మంత్రికి భీమిలి, విశాఖ తూర్పు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు మంత్రి లోకేశ్‌ను కలిశారు. గత ఏడాది మైదాన ప్రాంతం నుంచి ఎక్కువమందిని ఏజెన్సీకి బదిలీ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ తమను తిరిగి మైదానానికి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

హుస్సేన్‌సాగర్‌ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 27 , 2025 | 12:46 PM