Sathyakumar AP Medical Colleges: పేద విద్యార్థికి వైద్య విద్య.. ఇదే కూటమి సర్కార్ లక్ష్యం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:36 PM
గత వైసీపీ ప్రభుత్వం పాపాలు తమకు శాపాలుగా మారాయని సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు. పీపీపీకి ప్రైవేటైజేషన్‌కు తేడా తెలియకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైద్య కళాశాలలో నిర్మించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదన్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ 7: గత ప్రభుత్వం అసమర్థ పాలన వలన మెడికల్ కళాశాలలకు ఈ దుస్థితి వచ్చిందని మంత్రి సత్య కుమార్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్వతీపురం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తే గత ఐదేళ్లలో కనీసం భూసేకరణ కూడా చేయలేదని.. హాస్పిటల్ నిర్మాణానికి టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం పట్టించుకోలేని వైసీపీ నాయకులు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. పాడేరులో మెడికల్ కళాశాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేయకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాలను విస్మరించిందని.. గిరిజన విశ్వవిద్యాలయం రాకుండా అడ్డుకున్నాని విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వం పాపాలు తమకు శాపాలుగా మారాయని వ్యాఖ్యలు చేశారు. పీపీపీకి ప్రైవేటైజేషన్‌కు తేడా తెలియకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైద్య కళాశాలలో నిర్మించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదన్నారు. వైద్య విద్యను రాష్ట్రంలో పేద విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. గతంలో తాము చేయలేని పనిని కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారుని వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చితే.. తాము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా నిర్మాణం చేస్తున్నామని వెల్లడించారు. పాఠశాలలలో కనీసం నిర్వహణ పనులు గత ప్రభుత్వం చేయలేదన్నారు.
‘జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కళాశాలల పరిశీలనకు వస్తే అదే సమయంలో నేను వస్తాను. మెడికల్ కళాశాలల పరిస్థితిని జగన్‌మోహన్ రెడ్డికి వివరిస్తాను. జగన్ ప్యాలెస్ పూర్తిస్థాయిలో నిర్మాణం చేసే వరకు లోపలికి వెళ్లారా. నర్సీపట్నం మెడికల్ కళాశాల పరిశీలనకు వస్తున్న జగన్ పార్వతీపురంలో నిర్మించిన మెడికల్ కళాశాల చూసి అక్కడ పరిస్థితిని వివరించాలి. జగన్ ప్రజలను అసత్యాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ కు గుణపాఠం చెప్పిన మార్పు రావడం లేదు. జగన్ ఆత్మ పరిశీలన చేసుకొని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకునిలా వ్యవహరించాలి. జగన్‌కు అసెంబ్లీకి రమ్మని సవాల్ విసిరినా రాలేదు’ అంటూ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
జగన్‌కు హెలికాఫ్టర్ ఓకే.. రోడ్ షోకు నో పర్మిషన్
ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే
Read Latest AP News And Telugu News