Minister Narayana: విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సదస్సు.. హాజరుకానున్న నారాయణ
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:58 AM
విశాఖలో రేపు, ఎల్లుండి జరిగే సీఐఐ సదస్సులో మంత్రి పాల్గొని.. ఏపీ సీఆర్డీయేలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇందుకోసం మంత్రి నారాయణ నేడు విశాఖకు చేరుకున్నారు.
అమరావతి, నవంబర్ 13: మంత్రి నారాయణ ఈరోజు (గురువారం) ఉదయం విశాఖ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై జరిగే సదస్సుకు మంత్రి హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబుతో నాయుడితో కలిసి సమావేశానికి హాజరవుతారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సదస్సులో నారాయణ ప్రసంగించనున్నారు. రేపు , ఎల్లుండి విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి పాల్గొననున్నారు. భాగస్వామ్య సదస్సులో ఏపీ సీఆర్డీయేలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. సస్టెయినబుల్ సిటీస్‌కు సంబంధించి భాగస్వామ్యం సదస్సులో మంత్రి నారాయణ ప్రసంగించనున్నారు.
మరోవైపు సీఐఐ సదస్సు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపనున్నారు. ఈరోజు ఉదయం నోవోటెల్ హోటల్‌లో ఇండియా -యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా - యూరోప్ కోపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగనుంది. రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై పారిశ్రామిక ప్రతినిధులతో చర్చలు జరుగనున్నాయి.
అలాగే మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్ ఎండీ అలోక్ కిర్లోస్కర్, రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా, యాక్షన్ టెసా గ్రూప్ చైర్మన్ ఎన్ కె అగర్వాల్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. మురుగప్ప గ్రూప్ చైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ శంకర్ సుబ్రహ్మణియన్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చైర్మన్ రాహుల్ ముంజాల్‌తో సీఎం సమావేశాలు జరుగనున్నాయి. సాయంత్రం ‘వైజాగ్ ఎకనమిక్ రీజియన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం సీఐఐ నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి...
సెన్సార్ పూర్తి... రిలీజ్‌కు రెడీ
ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్‌లో లోకేష్ ట్వీట్
Read Latest AP News And Telugu News