Minister Nara Lokesh: ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్‌లో లోకేష్ ట్వీట్
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:39 AM
ఐదేళ్ల తర్వాత రీన్యూ పవర్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకటించారు.
అమరావతి, నవంబర్ 13: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతుందని... 9 గంటలకు ప్రకటన అంటూ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఈరోజు (గురువారం) ఉదయం ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అనుకున్న విధంగా సరిగ్గా 9 గంటలకు రాబోయే భారీ పెట్టుబడి ఏంటో రివీల్ చేశారు. ఏపీలో రీన్యూ పవర్ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రీన్యూ పవర్ పెట్టుబడులు పెడుతోందన్నారు. పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులను రీన్యూ పవర్ నెలకొల్పనున్నట్లు మంత్రి వెల్లడించారు.
లోకేష్ ట్వీట్...
‘రీన్యూ పవర్ ₹82,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోకి తిరిగి అడుగుపెడుతోంది. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెడుతున్న రీన్యూ పవర్ పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. సోలార్ ఇంగాట్ & వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ & గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉంది’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
కాగా.. 2019లో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం.. వచ్చీ రావడంతోనే పీపీఏలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో నాడు రెన్యూ ఎనర్జీ సంస్థ.. పీపీఏల రద్దు దుమారంతో రాష్ట్రానికి గుడ్ బై చెప్పేసింది. టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏ ఒప్పందాలను కక్ష పూరితంగా, కుట్ర పూరితంగా నాడు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలను వెళ్లగొట్టేలా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీపీఏల రద్దు వ్యవహరం నుంచే రాష్ట్రం ఇమేజ్ నాడు జాతీయంగా, అంతర్జాతీయంగా డామేజ్ అయ్యింది. పీపీఏల రద్దు విషయంలో నాడు జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని... కేంద్ర ప్రభుత్వం చెప్పినా, హెచ్చరించినా పట్టించుకోని పరిస్థితి. అలా నాడు వెళ్ళిపోయిన సంస్థను మళ్లీ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చేలా చేయడంతో పారిశ్రామిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి వస్తుండడంతో బ్రాండ్ ఏపీ తిరిగి నిలబడింది.
ఇవి కూడా చదవండి...
టెర్రరిస్ట్ సయ్యద్ నివాసంలో గుజరాత్ పోలీసుల సోదాలు
సెన్సార్ పూర్తి... రిలీజ్‌కు రెడీ
Read Latest AP News And Telugu News