Sarada River Bridge Suicide: అనకాపల్లిలో దారుణం.. నదిలోకి దూకిన యువతి
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:45 PM
శారదా నది వంతెనపై ఉన్న యువతి ఫోను, చెప్పులు ఆధారంగా మృతురాలు కీర్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లిలో భారీ గణపతి ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి చెందిన నిర్వహుకుడి కుమార్తెగా పేర్కొన్నారు.
అనకాపల్లి: మునగపాక మండలం ఉమ్మలాడ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. శారదా నది వంతెనపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి శారదా నదిలో దూకడాన్ని గమనించిన వాహన దారుడు పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శారదా నది వంతెనపై ఉన్న యువతి ఫోను, చెప్పులు ఆధారంగా మృతురాలు కీర్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లిలో భారీ గణపతి ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి చెందిన నిర్వహుకుడి కుమార్తెగా పేర్కొన్నారు. అయితే యువతి బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్మార్ట్ ఫోన్లు వచ్చాక లఘు చిత్రాలకు పెరిగిన ఆదరణ: మంత్రి నిమ్మల
మరోసారి రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఏం చేశారంటే..